వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..తన భర్తది రెండవ వివాహం అంట
on Apr 29, 2024
పవర్ ఫుల్ యాక్టింగ్ తో సినీ సీమలో తన కంటు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె ఒక సినిమా ఒప్పుకుందంటే చాలు. ఖచ్చితంగా అది విషయం ఉన్న సినిమా అనే భావన ప్రేక్షకుల్లో చాలా బలంగా నాటుకుపోయింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన కాబోయే భర్త పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
వరలక్ష్మి కి ఇటీవలే ముంబై కి చెందిన నికోలయ్ సచ్ దేవ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇరు వైపుల కుటుంబాలకి చెందిన సన్నిహితులు మాత్రమే ఆ వేడుకకి హాజరయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో వరలక్ష్మి, నికోలయ్ మీద ట్రోల్ల్స్ వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే నికోలయ్ కి ఇది రెండవ వివాహం. మొదట భార్యకి ఒక కూతురు కూడా ఉంది. ఈ విషయం పైనే ట్రోల్ల్స్ చేస్తున్నారు. వీటికి వరలక్ష్మి తన దైన స్టైల్లో జవాబు ఇచ్చింది. మా రిలేషన్ గురించి ఎవరు ఏమని అనుకున్నా పర్లేదు. మా నాన్న కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయన సంతోషంగా ఉన్న వరకు అందులో ఎలాంటి తప్పు లేదు.
నికోలయ్ మాజీ భార్యతో నాకు పరిచయం ఉంది. ఆమె వ్యక్తిత్వం చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.14 సంవత్సరాల క్రితం నికోలయ్ తో పరిచయం అయ్యింది.ఆ తర్వాత స్నేహితులమయ్యాం. ఆ స్నేహం ఇటీవల ప్రేమగా మారింది. నా కెరీర్ కి సంబంధించి సలహాలు కూడా ఇస్తుంటాడు అని చెప్పుకొచ్చింది ఆమె లేటెస్ట్ గా శబరి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సైకిలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కగా మే 3 న విడుదల కానుంది. ఇక నికోలయ్ ముంబై లో ఆర్ట్ గ్యాలరీలు నిర్వహిస్తుంటాడు
Also Read