బోల్డ్ గా 'టాక్సిక్' గ్లింప్స్.. 'పెద్ది'కి షాక్ తప్పదా?
on Jan 8, 2026

2022లో 'కేజీఎఫ్-2'తో పాన్ ఇండియాని షేక్ చేసిన కన్నడ స్టార్ యశ్, నాలుగేళ్ళ తర్వాత 'టాక్సిక్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్, మార్చి 19న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ఎలా ఉండబోతుందో తెలుపుతూ 'ఇంట్రడ్యూసింగ్ రాయ' పేరుతో స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
రెండున్నర నిమిషాలకు పైగా నిడివితో రూపొందించిన 'టాక్సిక్' గ్లింప్స్ బోల్డ్ గా, ఇంటెన్స్ గా ఉంది. మేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ ప్రతిదీ హాలీవుడ్ సినిమాలను తలపిస్తున్నాయి. కొడుకుని కోల్పోయిన ఓ గ్యాంగ్ స్టర్.. తన అనుచరులతో కలిసి స్మశానంలో ఉంటాడు. ఒకతను కారులో వచ్చి స్మశానంలో బాంబ్ బ్లాస్ట్ కోసం కనెక్షన్ ఇచ్చి వెళ్లిపోగా.. గ్యాంగ్ స్టర్ అనుచరులు ఆ కారుపై కాల్పులు జరుపుతారు. కారులో లేడీతో శృంగారం చేస్తూ ఉన్న యశ్.. బాంబ్ బ్లాస్ట్ జరిగాక.. కారు దిగి గన్ తో శత్రువులపై విరుచుకుపడతాడు. కేజీఎఫ్ రేంజ్ లో యశ్ ఎలివేషన్ షాట్స్ అదిరిపోయాయి.
కేవలం ఒకే ఒక్క గ్లింప్స్ తో ఇప్పుడు 'టాక్సిక్' మూవీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారు సీన్ చూసి.. ఒక లేడీ డైరెక్టర్ సినిమాలో ఈ రేంజ్ బోల్డ్ సీనా! అంటూ అందరూ అవాక్కవుతున్నారు. అయితే బోల్డ్ సీన్ ఏ రేంజ్ లో సర్ ప్రైజ్ చేసిందో.. మేకింగ్ పరంగా ఓవరాల్ గ్లింప్స్ కూడా అదే రేంజ్ లో సర్ ప్రైజ్ చేసిందని చెప్పవచ్చు.
'టాక్సిక్' గ్లింప్స్ అదిరిపోవడంతో మార్చి 27న విడుదల కానున్న రామ్ చరణ్ 'పెద్ది'పై ఏమైనా ప్రభావం పడుతుందా అనే చర్చ జరుగుతోంది. చరణ్ సినిమా అంటే పాన్ ఇండియా వైడ్ గా విడుదలవుతుంది. కానీ మార్చి 19న 'ధురంధర్-2', 'టాక్సిక్' సినిమాలు ఉండటంతో.. థియేటర్లు కావాల్సినన్ని దొరకడం కష్టమే.
న్యూ బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 'ధురంధర్'కి సీక్వెల్ కావడంతో నార్త్ లో 'ధురంధర్-2' డామినేషన్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక 'టాక్సిక్' కూడా సౌత్ తో పాటు నార్త్ లో ప్రభావాన్ని చూపేలా ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట 'పెద్ది'కి అంత అనుకూలంగా ఉండే పరిస్థితి లేదు.
అయితే పెద్ది మూవీ వాయిదా పడే అవకాశముందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి పెద్ది వాయిదా పడుతుందా? లేక మార్చిలోనే విడుదలై కంటెంట్ తో ఆ రెండు సినిమాలకు షాకిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



