రికార్డు ధరకు ది రాజా సాబ్ ఓటీటీ రైట్స్.. ఎంతో తెలుసా?
on Dec 6, 2025
పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. వాటిలో మొదటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా 'ది రాజా సాబ్'. మారు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ప్రభాస్ కెరీర్లో తొలిసారి హారర్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిచ్చేందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ ఎలా ఉంటుందనేది పక్కన పెట్టేస్తే.. అందరి దృష్టీ ఓటీటీపైనే ఉంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కి ఎంత వస్తుంది అనే దానిపై అంచనాలు వేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేస్తుందనే వార్తలు గతంలో వచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.
అన్ని భాషలకు సంబంధించిన ఓటిటి హక్కుల కోసం జియో హాట్‌స్టార్ దాదాపు రూ. 170 కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం రావాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల ద్వారా వినిపిస్తున్న ఈ వార్త నిజమే అయితే ఓటీటీ రైట్స్‌కి అత్యధిక రేటు సంపాదించిన సినిమాగా 'ది రాజా సాబ్' నిలుస్తుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



