The Raja Saab: 'ది రాజా సాబ్' ఫస్ట్ రివ్యూ.. షాకిస్తున్న సెన్సార్ రిపోర్ట్!
on Dec 23, 2025
.webp)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీ 'ది రాజా సాబ్'(The Raja Saab). మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్, సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా రెండు వారాలకు పైగా సమయం ఉండగానే.. ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకోవడం విశేషం.
'ది రాజా సాబ్' సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రన్ టైమ్ ని 183 నిమిషాలు(3 గంటల 3 నిమిషాలు)గా లాక్ చేసినట్లు సమాచారం.
రాజా సాబ్ సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గానే ఉంది. ఫ్యాన్స్ కి నచ్చేలా వింటేజ్ ప్రభాస్ ని చూపించారట. ప్రభాస్ ఎంట్రీ సీన్ అదిరిపోయిందని అంటున్నారు. హారర్ సీన్స్ తో పాటు కామెడీ సీన్స్, రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చాయని చెబుతున్నారు. ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయట. ప్రభాస్ అభిమానులకు మాత్రమే కాకుండా.. హారర్ కామెడీ జానర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుందనే మాట వినిపిస్తోంది. సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయని, ట్విస్ట్ లు బాగా పేలాయని వినికిడి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలిచాయని చెప్పుకుంటున్నారు.
Also Read: దివ్య దృష్టి మూవీ రివ్యూ
మారుతీ దర్శకత్వంలో 'రాజా సాబ్' అనే భారీ బడ్జెట్ హారర్ ఫిల్మ్ ప్రభాస్ చేస్తున్నాడని తెలిసి.. మొదట్లో ఈ సినిమా రిజల్ట్ పై పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు వారి అనుమానాలను పటాపంచలు చేసేలా వచ్చిన సెన్సార్ రిపోర్ట్ ని బట్టి చూస్తే.. 'రాజా సాబ్' రూపంలో ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయమనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



