రాజాసాబ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రావాల్సింది ఇదేనా! ఫ్యాన్స్ ఏమంటున్నారు
on Jan 7, 2026

మొదలైన రాజా సాబ్ హంగామా
థియేటర్స్ అన్ని ప్రభాస్ కట్ అవుట్ లతో ఫుల్
కలెక్షన్స్ పై సినీ ట్రేడ్ వర్గాలు ఏమంటున్నాయి
బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత రాబట్టాలి
పాన్ ఇండియా రెబల్ స్టార్ 'ప్రభాస్'(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై రాజా సాబ్(The Raja Saab)గా మెస్మరైజ్ చెయ్యబోయే ముహుర్తానికి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. ప్రభాస్ ఫస్ట్ టైం రొమాంటిక్ అండ్ హర్రర్ థ్రిల్లర్ లో చేస్తుండటం, ప్రచార చిత్రాలు కూడా ఒక రేంజ్ లో ఉండటంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని ప్రభాస్ అందుకుంటాడనే నమ్మకం అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉంది. మేకర్స్ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. రాజా సాబ్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్(TG Vishwaprasad)సుమారు 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించాడు.దీంతో సినీ ట్రేడ్ వర్గాల్లో రాజా సాబ్ సాధించే కలెక్షన్స్ తో పాటు బ్రేక్ ఎవెన్యూ అవ్వాలంటే ఎంత మేర కలెక్షన్స్ రాబట్టాలనే చర్చ జరుగుతుంది.
సినీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం రాజా సాబ్ బ్రేక్ ఎవెన్యూ సాధించాలంటే వరల్డ్ వైడ్ గా . 400 కోట్లు గ్రాస్, తెలుగులో 300 కోట్లు గ్రాస్ ని రాబట్టాలని చెప్తున్నారు.ప్రభాస్ కట్ అవుట్ కి ఉన్న క్రేజ్ తో పాటు రాజా సాబ్ కి సినీ మార్కెట్ లో ఉన్న మ్యానియా దృష్ట్యా బ్రేక్ ఎవెన్యూ ఫిగర్ ని రాబట్టడం పెద్ద విషయం కాదనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే మాత్రం 1000 కోట్లు పక్కా అని సోషల్ మీడియా వేదికగా హంగామా చేస్తున్నారు.
Also read: నా భార్య కొడుతుంది.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ప్రముఖ నటుడు
ఇక రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు రాజా సాబ్ ని గౌరవిస్తూ టికెట్ పెంపు విషయంలో సానుకూలంగా స్పందించింది. ఈ పెంపు కూడా రాజా సాబ్ కలెక్షన్స్ ల పెరుగుదలకి కలిసొచ్చే అవకాశం ఉంది. అభిమానులు,ప్రభాస్ తో పాటు చిత్ర దర్శకుడు మారుతీ(Maruthi)హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ సహా చిత్ర బృందం మొత్తం రాజా సాబ్ విజయంపై పూర్తి నమ్మకంతో ఉంది. ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటు రాజా సాబ్ పై అంచనాలని పెంచుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



