93 కోట్ల రూపాయిలకి టీవీల్లో
on May 10, 2024
ఇళయ దళపతి విజయ్ తో ఆట సింహంతో వేట రెండు ఒకటే.. ఈ మాట విజయ్ కొత్త సినిమా రిలీజ్ రోజున ఫ్యాన్స్ చెప్తుంటారు. వాళ్ళు చెప్పినట్టుగానే టాక్ తో సంబంధం లేకుండా సదరు మూవీ రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. సాక్షాత్తు ఫ్యాన్సే షాక్ కి గురవుతున్నారు
విజయ్ అప్ కమింగ్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టిన నేపధ్యంలో మూవీపై అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అది కూడా రికార్డు స్థాయిలో. అలాగే ఓటిటి డీల్ కూడా పూర్తయ్యింది. ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ 150 కోట్లకి దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితం ఈ న్యూస్ సంచలనం సృష్టించగా ఇప్పుడు ఇంకో సంచలన న్యూస్ బయటకి వచ్చింది. శాటిలైట్ హక్కులని జీ సంస్థ 93 కోట్ల రూపాయిల భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఇది హయ్యెస్ట్ పెయిడ్ అమౌంట్ అని చెప్పవచ్చు
విజయ్ డ్యూయల్ రోల్ పోషిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుంది. ఏజిఎస్ ఎంటర్ టైన్మెంట్ పై కల్పతి ఎస్ అఘోరామ్, గణేష్, సురేష్ లు నిర్మిస్తున్నారు. హిట్ చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.తమిళంలో ఇప్పటి వరకు సుమారు పది చిత్రాల దాకా ఆయన నుంచి వచ్చాయి . గత సంవత్సరం తెలుగులో నాగ చైతన్య హీరోగా వచ్చిన కస్టడీ కి ప్రభునే దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం లో ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, జయరాం,మోహన్ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. విజయ్ కెరీర్ లో ఇది 68 వ చిత్రం