మలయాళ హిట్ మూవీ తెలుగులో రిమేక్.. హీరోగా స్టార్ డైరెక్టర్!
on Apr 17, 2024
కొన్ని సినిమాలు ఏ అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ సాధిస్తాయి. అలాంటి వాటిల్లో బలగం, కేరాఫ్ కంచర పాలెం లాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో చిన్న హీరోల సినిమాలు ఇండస్ట్రీలో భారీ కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి. దీంతో కొంతమంది దర్శక, నిర్మాతలు వాటినే తీయడానికి ముందుకొస్తున్నారు.
మలయాళ సినిమాలు తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. తాజగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోని మేకర్స్.. ప్రేమలు, ముంజుమల్ బాయ్స్ లాంటి కొన్ని సినిమాలని తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు వర్షన్ ని తీసుకొచ్చారు. అవి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేశాయి. దాంతో ఆ భాషలలో హిట్ అయిన ఓ సినిమాని తెలుగులో రిమేక్ చేయడానికి కొంతమంది దర్శక, నిర్మాతలు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేంటంటే కరోనా టైమ్ లో ఓటీటీలో వచ్చిన సినిమా ' జయజయజయహే'. ఏ అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా అత్యధిక వసూళ్ళని సాధించింది. ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ హీరో హీరోయిన్లుగా చేశారు. అయితే ఈ మూవీని తెలుగులో రిమేక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రముఖ నటుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మలయాళ సినిమాలలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కి భళే క్రేజ్ ఉంది. అందులోను తెలుగు అభిమానులకి ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ మూవీ లేకపోవడంతో సప్పగా సాగుతోంది. దానికోసమే కొంతమంది దర్శక నిర్మాతలు ఇలాంటి ఇతర భాషా చిత్రాలలో హిట్ అయిన వాటిని రిమేక్ చేయడానికి ముందుకొస్తున్నారు. మరి మీకు నచ్చిన మలయాళ సినిమా ఏంటి? ఒకవేళ రిమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.
Also Read