టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా
on Jan 3, 2026

ఈమెనే టబు కూతురు
స్వయంగా పరిచయం చేసిన టబు
మరి పెళ్లి కానీ టబుకి కూతురు ఎక్కడ్నుంచి వచ్చింది
అసలు ఇంతకీ ఆమె ఎవరు
మీడియాతో సహా అందరు షాక్
టబు(Tabu)..ఈ పేరు చెబితే తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది. టబు ఇంకా పెళ్లి చేసుకొని విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు టబు తన కూతురుని పరిచయం చెయ్యడం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది.
ఈ నెల 1 న న్యూ ఇయర్ వెల్ కమ్ చెప్తు బాలీవుడ్ లో 'ఇక్కీస్'(Ikkis)అనే మూవీ రిలీజయ్యింది. దేశ భక్తి నేపథ్యంతో తెరకెక్కగా మంచి టాక్ తోనే రన్ అవుతుంది. రీసెంట్ గా ఇక్కీస్ స్పెషల్ షో ని సినీ సెలబ్రటీస్ కోసం ముంబై వేదికగా మేకర్స్ ప్రదర్శించారు. ఈ షో కి టబు కూడా హాజరైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మీకు నా కూతురుని పరిచయం చేస్తానని చెప్పగానే అందరు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. టబు కూతురు ఎవరా అని ఒకింత ఉద్వేగంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడికి ప్రముఖ హీరోయిన్ ఫాతిమా సనా(Fathima Sana)వచ్చింది. టబు ఆమెని కౌగలించుకొని ఈమెనే నా కూతురు అని చెప్పింది. అప్పటికి కూడా అందరు షాక్ లో ఉన్నారు.
also read: అఖండ 2 ఓటిటి డేట్ ఇదేనా!
ఆ తర్వాత టబు మాట్లాడుతు 1997 వ సంవత్సరంలో 'చాచి 420’మూవీలో ఫాతిమా నా కూతురిగా చేసింది. అప్పట్నుంచి ఫాతిమా నా కూతురే అని టబు చెప్పేసరికి మీడియా తో పాటు అక్కడున్న వాళ్ళందరు నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియా వేదికగా టబు అభిమానులు స్పందిస్తు టబు మేడం మీరు త్వరగా పెళ్లి చేసుకొని నిజమైన కూతుర్ని పరిచయం చేయాలని కోరుకుంటున్నామనే కామెంట్స్ చేస్తున్నారు. ఇక దంగల్ తో ఫాతిమా ఇండియా వైడ్ గా ఫుల్ పాపులారిటీ ని సంపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



