చేతులు జోడించి అడుగుతున్నా.. శ్రీలీల ఎమోషనల్!
on Dec 17, 2025

ఏఐ అనేది హీరోయిన్స్ పాలిట విలన్ గా మారుతోంది. ఏఐని కొందరు మంచిగా ఉపయోగిస్తూ అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు చెడుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల ఫేస్ తో అసభ్యమైన ఫేక్ ఫోటోలు, వీడియోలు జనరేట్ చేస్తున్నారు. ఇవి నిజమైనవని నమ్మేవారు కూడా ఉన్నారు. దీంతో హీరోయిన్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఈ ఫేక్ బారిన పడగా.. తాజాగా శ్రీలీల వంతు వచ్చింది. (Sreeleela)
ఎవరో ఆకతాయిలు ఏఐ ద్వారా శ్రీలీల ఫేక్ ఫోటోలు జనరేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం శ్రీలీల దృష్టికి వెళ్ళడంతో ఆమె స్పందించింది. ఇటువంటి వాటిని ప్రోత్సహించవద్దని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read: కామెడీ లేని రాజా సాబ్.. షాకిచ్చిన మారుతీ!
"ఏఐ ద్వారా జనరేట్ చేసే నాన్ సెన్స్ కి సపోర్ట్ చేయవద్దని ప్రతి సోషల్ మీడియా యూజర్ ని చేతులు జోడించి అడుగుతున్నాను. టెక్నాలజీని మంచికి ఉపయోగించాలి, చెడుకి కాదు. నా తోటి నటీమణులు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రేక్షకులు మాకు అండగా నిలవాలని కోరుతున్నాను." అంటూ శ్రీలీల ట్వీట్ చేసింది.
శ్రీలీల ట్వీట్ కి నెటిజెన్ల నుంచి మద్దతు లభిస్తోంది. ఏఐ వల్ల మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



