యుఎస్ లో సింగిల్ మూవీ రికార్డు..మనల్ని ఎవడ్రా ఆపేది
on May 22, 2025
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు(Sri Vishnu)కేతిక శర్మ(Ketika Sharma)ఇవానా(Ivana)వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'సింగిల్'(Single). శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకెళ్తున్న ఈ మూవీ రెండు వారాలు దాటినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్ళని సాధిస్తుంది.
తాజాగా ఈ మూవీ యుఎస్ లో 700K డాలర్ల క్లబ్ లో చేరి చిన్న సినిమాల్లోనే సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. దీంతో యుఎస్ లో సింగిల్ మూవీ ఫైనల్ గా ఎంత మేర రాబడుతుందనే చర్చ సినీ సర్కిల్స్ లో జరుగుతుంది. సింగిల్ అయిన శ్రీవిష్ణు ఆడ తోడుకోసం తాపత్రయపడుతు, అతి తెలివితో తన లైఫ్ లోకి వచ్చిన ఇద్దరి అందమైన అమ్మాయిలని దూరం చేసుకుంటాడు. ఈ క్రమంలో శ్రీ విష్ణు చేసే కామెడీ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ కి రిపీట్ ఆడియెన్స్ కూడా వెళ్తున్నారు. కేతిక శర్మ, ఇవానా కూడా తమ క్యారక్టర్ ల మేరకు అత్యద్భుతంగా నటించి చిత్ర విజయంలో బాగస్వామ్యమయ్యారు.
కార్తీక్ రాజు(Caarthick Raju)రచనా దర్శకత్వంలో తెరకెక్కిన సింగల్ ని గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలింస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియచేస్తు చిత్ర బృందం రీసెంట్ గా విజయయాత్ర కూడా చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
