ENGLISH | TELUGU  

శృతి హాసన్ వల్ల ఒక పాప ప్రాణాలు సేఫ్.. ఆ పాప ఎవరో తెలుసా

on Feb 3, 2026

 


-సోషల్ మీడియా వేదికగా అభినందనలు 
-ఇంతకీ శృతి చేసిందేంటి
-పాప పేరేంటి
-పాపకి వచ్చిన అరుదైన వ్యాధి ఏంటి!


మొదట్లో ఐరన్ లెగ్.. ఆ తర్వాత గోల్డెన్ లెగ్.. దాంతో శృతి హాసన్(Shruti Haasan)డేట్స్ కోసం నిర్మాతలు వెయిట్ చేసే పరిస్థితి. హీరోల ఫ్యాన్స్ సైతం తమ హీరోతో శృతి హాసన్ జత కట్టాలని కోరుకుంటారు. దీన్ని బట్టి శృతి హాసన్ పేరుకి ఉన్న ఫైర్ ని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా శృతి హాసన్ వల్ల ఒక పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ విషయాన్నీ పాప తల్లి తండ్రులే తెలియచేసారు. ఆ డీటెయిల్స్ ఏంటో పూర్తిగా చూద్దాం.


అజ్వి.. మూడు సంవత్సరాల వయసున్న పాప. msmd అనే జన్యు సంబంధమైన వ్యాధితో పాప బాధపడుతుంది. msmd అంటే మెండెలియన్ సెన్సిబిలిటీ ఆఫ్ మైకోబాక్టీరియల్ డిసీజెస్.100,000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. కండరాలు, నరాలకి సంబంధించిన వ్యాధి అందులో ప్రధానమైంది. దీంతో పాపకి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ కింద  ఎముక మజ్జ మార్పిడి చెయ్యాలని డాక్టర్స్ సూచించారు. అందుకు భారీ మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయని పైగా సరైన సమయంలో ఆపరేషన్ చెయ్యకపోతే ప్రాణాలు పోతాయని చెప్పారు. దీంతో పాప పేరెంట్స్ శృతి హాసన్ ఏర్పాటు చేసిన ట్రస్ట్  charity closet ని సంప్రదించారు. ఆపరేషన్ కి కావాల్సిన ఆర్ధిక సాయం చెయ్యడంతో పాటు తనకి తెలిసిన డాక్టర్స్ చేత శృతి ఆపరేషన్ చేయించింది.ప్రస్తుతం పాప ప్రాణాలకి ప్రమాదం లేదు. ఈ మేరకు పాప తల్లితండ్రులు శృతిహాసన్, పాప కలిసి గడిపిన ఆనంద క్షణాలని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో అభిమానులు, నెటిజన్స్ శృతి హాసన్ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Also read:  పారిశుధ్య కార్మికురాలికి రజినీ కాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

 

శృతి హాసన్  2021 వ సంవత్సరంలో charity closet ని ఏర్పాటు చేసింది. అప్పట్నుంచి ఎంతో మందికి వైద్య పరంగా సేవలు అందిస్తూ ఉంది. హెచ్ ఐ వి బాధితులకి కూడా అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ ఉండడం విశేషం.



 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.