అజిత్ బర్త్ డే కి ప్రముఖ హీరోయిన్ గిఫ్ట్..సోషల్ మీడియాలో వైరల్
on May 1, 2024
కల్ట్ ఫ్యాన్స్ కి పెట్టింది పేరు తమిళ సూపర్ స్టార్ అజిత్. తమ అభిమాన హీరోని ఎవరేమైనా అంటే వాళ్ళ అంతు తేల్చే వాళ్లే కల్ట్ ఫ్యాన్స్.రెండున్నర దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ అంతటి అభిమానాన్ని పొందాడు. 1996 లో తెలుగులో వచ్చిన ప్రేమలేఖ ద్వారా కూడా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. తాజాగా అజిత్ కి ఒక గిఫ్ట్ వచ్చింది.
ఈ రోజు అజిత్ 53వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన భార్య షాలిని ఒక అద్భుతమైన బహుమతిని ఇచ్చింది. స్పోర్ట్స్ బైక్ లో నెంబర్ వన్ బైక్ గా గుర్తింపు పొందిన డుకాటీ ని గిఫ్ట్ గా ఇచ్చింది. రెడ్ కలర్ కోటింగ్ తో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఆ బైక్ ధర సుమారు 20 లక్షలు దాకా ఉంటుంది. ప్రస్తుతం ఆ బైక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు వాటిని చూసి తమ సంతోషం వ్యక్తం చేస్తు అజిత్ కి బర్త్ డే విషెస్ చెప్తున్నారు. ఇక స్వతహాగా అజిత్ మంచి రేసర్. ఎన్నోపోటీల్లో పాల్గొని పలు ప్రైజ్ లని కూడా గెలుచుకున్నాడు.
ప్రస్తుతం విడా ముయార్చి అనే కొత్త మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మగిజ్ తిరుమేని దానికి దర్శకుడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రానికి కూడా ఓకే చెప్పాడు.అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా మొదటి సారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అజిత్ వైఫ్ షాలిని కూడా బాలనటిగా, హీరోయిన్ గా చాలా సినిమాల్లో చేసింది.చిరంజీవి హీరోగా వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి లో కళ్ళజోడు పెట్టుకొని కనపడే అమ్మాయి తనే. అలాగే మాధవన్ హీరోగా వచ్చిన మణిరత్నం సఖి లో సోలో హీరోయిన్ గా తమిళ, తెలుగు ప్రేక్షకులని ఒక ఊపు ఊపింది.
Also Read