ఆ రిలేషన్ టాక్సిక్ రిలేషన్ అంటున్న సమంత.. అంతా డిజిటల్ డీటాక్స్ నే
on Jul 9, 2025
'సమంత'(Samantha)మే 9 న 'శుభం' అనే 'హర్రర్ కామెడీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఒక ముఖ్యమైన క్యారక్టర్ ని పోషించింది. ఈ మూవీ తర్వాత తన ఓన్ ప్రొడక్షన్ లోనే 'మా ఇంటి బంగారం' అనే మూవీ చేస్తున్నట్టుగా చాలా రోజుల క్రితమే ప్రకటించినా, షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. నెట్ ఫ్లిక్స్ నిర్మించే హిందీ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ లో కూడా సమంత చేస్తునట్టు అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ ఈ సిరీస్ ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా సమంత మానసిక శారీరక ఆరోగ్యానికి సంబంధించిన పలు సమస్యలపై 'టేక్ 20 హెల్త్' అనే హెల్త్ ప్రోగ్రాం ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయా రంగాల్లోని నిపుణులైన వారి చేత కూడా అవగాహన కల్పిస్తూ ఉంటుంది. అందులో భాగంగా రీసెంట్ గా జరిగిన ఒక ప్రోగ్రాం లో సమంత మాట్లాడుతు ఒకానొక సమయంలో మొబైల్ ఫోన్ కి ఎంతగానో అడిక్ట్ అయ్యాను. ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండేదాన్ని కాదు. అదొక టాక్సిక్ రిలేషన్ షిప్ లాగా ఫీలయ్యాను. ఆ విషయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోకపోయేదాన్ని. ఈ విషయంలో నన్ను నేను ప్రశ్నించుకొని, ఆ అలవాటు నుంచి తప్పించుకునేందుకు డిజిటల్ డీటాక్స్ ఫాలో అయ్యాను. ఎవరితోనూ మాట్లాడకుండా, ఫోన్ చూడకుండా, వరుసగా మూడు రోజులు ఉన్నాను. అలా కొన్ని రోజులు పాటించిన తర్వాత ఎంతో మారానని చెప్పుకొచ్చింది.
రీసెంట్ గా సమంత అమెరికా వెకేషన్ కి వెళ్ళింది. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు రాజ్(Raj dk)తో కలిసి అమెరికా వీధుల్లో దిగిన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమంత ,రాజ్ లు రిలేషన్ లో ఉన్నారనే వార్తలు గత కొంత కాలం నుంచి వినిపిస్తున్న ఈ నేపథ్యంలో, ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజ్ దర్శకత్వంలో వచ్చిన 'ఫ్యామిలీ మాన్ సీజన్ 2 ', 'సిటాడెల్ హనీ బన్నీ' వెబ్ సిరీస్ లు నటిగా సమంత కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. శుభం మూవీకి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
