పేరు మార్చుకుంటున్న సమంత!.. ఈ పేరు ఎలా ఉంటుందో చెప్తారా
on Jan 29, 2026

-సమంత కీలక నిర్ణయం
-పేరు మార్పు వెనక ఎవరున్నారు
-అసలు పేరు ఏంటి!
సమంత(Samantha)అనే పేరు వింటే చాలు అభిమానులు పులకరించిపోతారు.అంతలా దశాబ్దంన్నర నుంచి అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ని కనపరుస్తు తనకంటూ సొంతంగా అభిమానులని సంపాదించుకుంది. పైగా హీరోల రేంజ్ స్టేటస్ ఆమె సొంతం. ఇక తమ అభిమాన నటి వ్యక్తిగత జీవితం సరిగా లేదని బాధపడుతున్న అభిమానులకి దర్శకుడు 'రాజ్ నిడిమోరు'ని పెళ్లి చేసుకొని గిఫ్ట్ గా ఇచ్చింది.దీంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే వివాహానికి ముందు సమంత, రాజ్ లు కలిసి తిరగడంతో ఆ ఇద్దరి పై చాలా మంది సోషల్ మీడియా వేదికగా అనేక రూమర్స్ ని, మీమ్స్ ని క్రియేట్ చేసారు.
దీంతో అభిమానులు హర్ట్ అయ్యారు. అలాంటిది సమంత, రాజ్ ఒకరికొకరు వివాహం చేసుకోవడంతో ఇప్పుడు వాళ్లంతా తలెత్తుకొని తిరుగుతున్నారు. రీసెంట్ గా రాజ్ నిడిమోరు కోసం సమంత తన పేరు మార్చుకోబోతుందనే విషయం సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. దీంతో సమంత అనే పేరుని మార్చుకోవద్దనే కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆ పేరు వెనక ఉన్న పూర్తి మేటర్ తెలిసి హ్యాపీగా ఫీలవుతున్నారు. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.
సమంత పూర్తి పేరు సమంత రుతు ప్రభు అని తెలిసిందే. ఇప్పుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)కోసం తన పేరుని సమంత నిడిమోరు గా మార్చుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో రాబోయే చిత్రాల్లో సమంత పేరు సమంత నిడిమోరు గా సిల్వర్ స్క్రీన్ పై కనపడనుంది. సోషల్ మీడియాలో సైతం సేమ్ నేమ్.. ఈ విధంగా పూర్తి విషయం తెలియడంతో అభిమానులు హ్యాపీ గా ఫీలవుతున్నారు.
Also read: హీరోతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సీరియల్ నటి.. లివింగ్ రిలేషన్ లో ఉన్నారు కదా
సమంత అప్ కమింగ్ సినీ జర్నీని చూసుకుంటే ప్రస్తుతం 'మా ఇంటి మహాలక్ష్మి' అనే మూవీ చేస్తుంది. నందిని రెడ్డి(Nandini Reddy)దర్శకురాలు కాగా సమంత, రాజ్ లే నిర్మాతలు. రాజ్ దర్శకత్వంలోనే ఒక వెబ్ సిరీస్ కూడా సమంత చేయబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



