క్రేజీ డైరెక్టర్ పై వాలిపోయిన సమంత.. డైరెక్టర్ భార్య అదిరిపోయే పోస్ట్
on May 15, 2025
సమంత(Samantha)ప్రధాన పాత్ర పోషించిన 'ది ఫ్యామిలీమాన్ సీజన్ 2 ,సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లకి రాజ్ అండ్ డి కె(Raj and dk)ద్వయం దర్శకత్వం వహించింది. రాజ్,సమంత గత కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఆ సమయంలో రాజ్ భుజాలపై వాలిపోయినట్టుగా ఉన్న ఒక పిక్ ని సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో నిమిషాల్లోనే వైరల్ గా మారింది
రీసెంట్ గా రాజ్ వైఫ్ శ్యామాలి(Shhyamali)ఇనిస్టా వేదికగా పోస్ట్ చేస్తు 'నా గురించి ఆలోచించి, విని, మాట్లాడేవారితో పాటు నన్ను కలిసి నాతో మాట్లాడి నా గురించి రాసే వారందరకీ ప్రేమ ఆశీస్సులు పంపిస్తున్నా అనే పోస్ట్ ని షేర్ చేసింది. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేని శ్యామాలీ రీసెంట్ గా ఈ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ లో కొన్ని చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామాలి కొన్ని చిత్రాలకి క్రియేటివ్ కన్సల్టెంట్ గా వర్క్ చేసింది.
2015 లో రాజ్ తో వివాహం జరిగిన తర్వాత రాజ్ వర్క్ చేసే సినిమాలకి శ్యామలీ కాస్టింగ్ విభాగంలో వర్క్ చేస్తు వస్తుంది. గత కొంత కాలం నుంచి రాజ్,శ్యామలీ విడిపోతున్నారంటు ప్రచారం అయితే జరుగుతు ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
