'సలార్' ట్రైలర్ మామూలుగా లేదు.. పూనకాలే!
on Nov 28, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సీజ్ ఫైర్ డిసెంబర్ 22న విడుదల కానుంది. డిసెంబర్ 1న ట్రైలర్ రాబోతుంది.
ప్రభాస్ పాత్రని డైనోసార్ తో పోలుస్తూ ఇప్పటికే విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ అంతకుమించి ఎన్నో రెట్లు ఉంటుందట. 'సలార్' ట్రైలర్ కట్ అదిరిపోయిందని అంటున్నారు. ప్రభాస్ ని చూపించిన తీరు, ఎలివేషన్స్, బీజీఎం, డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయట. ఈ ట్రైలర్ తర్వాత సలార్ పై అంచనాలు రెట్టింపు అవుతాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ట్రైలర్ డిసెంబర్ 1న రాత్రి 7:19 గంటలకు విడుదల కానుంది.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సలార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
