శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా
on Aug 1, 2025
టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో ఉన్న అమెరికాలోనే అతిపెద్ద హనుమాన్ టెంపుల్ మెక్కినీలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి సువర్ణ హస్తాలతో RP పట్నాయక్ స్వీయ సంగీత దర్శకత్వంలో పాడిన హనుమాన్ చాలీసా విడుదల జరిగింది. శ్రీ గోస్వామి తులసీదాసు 16వ శతాబ్దంలో అవధి భాషలో రచించిన ఈ హనుమాన్ చాలీసా, తెలుగు, తమిళ్, కన్నడ, ,హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో ఆయా భాషలవారు చదువుకుంటూ పాడుకునేలా వీడియో రూపొందించటం జరిగింది అని దీని కార్యనిర్వహక నిర్మాత రఘురామ్ బొలిశెట్టి తెలియజేశారు.
హనుమంతుని అపార శక్తి గురించి వర్ణించే ఈ హనుమాన్ చాలీసా వినేటప్పుడు ఒక అద్భుతమైన అనుభూతి ఖచ్చితంగా కలుగుతుందని దీనిని రూపొందించిన RP పట్నాయక్ అన్నారు.
శ్రీ గణపతి సచ్చిదానంద వారు విని ఇది నేటి యువతకు బాగా చేరువవుతుందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో హనుమాన్ టెంపుల్ ఫౌండర్ శ్రీ ప్రకాష్ రావు గారు కూడా పాల్గొన్నారు. ఇది RP పట్నాయక్ తన స్వీయ యూట్యూబ్ ఛానెల్ లో విడుదల అయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



