‘డార్లింగ్.. వై దిస్ కొలవెరి?’.. ప్రియదర్శి, నభా నటేష్‌లతో ‘హనుమాన్’ నిర్మాత చేస్తున్న రచ్చ!
on Apr 20, 2024
‘హనుమాన్’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత నిర్మాత నిరంజన్‌రెడ్డి మరో వెరైటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ‘డార్లింగ్’. ప్రియదర్శి, నభానటేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోందని గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఇటీవల డార్లింగ్ అని పరిచయం లేని వ్యక్తుల్ని పిలిస్తే శిక్షకు అర్హులవుతారని కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీని గురించి నెట్టింట్లో ప్రియదర్శి, నభానటేష్ మధ్య భారీ ఎత్తున వాగ్వాదాలు చేసుకున్నారు, ట్వీట్ల మీద టీట్లు పెట్టుకున్నారు. ఇదంతా వారు చేస్తున్న సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అని ఒక దశలో అర్థమైపోయింది. ఆ సినిమా పేరు ‘డార్లింగ్’ అని తెలిసిన తర్వాత ఆల్రెడీ ప్రభాస్ డార్లింగ్ ఉండనే ఉంది. అదే టైటిల్‌తో మరో సినిమా ఎందుకు అని ప్రశ్నించినవారు కూడా ఉన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఇచ్చేశారు. సినిమా టైటిల్ ‘డార్లింగ్ వై దిస్ కొలవెరి?’.
ఈ సినిమాను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చేశారని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. హెయిర్ కట్ కోసం సెలూన్‌కి వచ్చిన ప్రియదర్శి ఎంతో ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. అందులోనే కొన్ని జీవిత సత్యాలను చెబుతాడు. ఆడవారు తల్లిగా, చెల్లిగా, ప్రియురాలిగా ఎలా ప్రేమ, ఆప్యాయతలను చూపిస్తారు, ఎలాంటి సపోర్ట్ అందిస్తారు. అని ఎంతోఎమోషనల్గా చెబుతాడు. ఆ తర్వాత భార్య గురించి చెబుతూ పెళ్లాంగా మారిన తర్వాత ఎందుకు రాచి రంపాన పెడతారు? అని అడుగుతాడు. ఎంతో ఫన్నీగా ఉన్న సినిమా గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
నభా నటేష్, ప్రియదర్శి కాంబినేషన్లో ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతోందని అర్థమవుతోంది. ఈ సినిమాలో ఇంకా రీతువర్మ కూడా ఉంది. అయితే ఈ గ్లింప్స్‌లో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్విన్‌రామ్ దర్శకత్వం వహిస్తుండగా, వివేక్‌సాగర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘డార్లింగ్’ అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక స్టార్ ప్రభాస్. తనకు సన్నిహితులైన వారందర్నీ ప్రభాస్ డార్లింగ్ అని పిలుస్తారని ప్రతి ఒక్కరికీ తెలుసు. పైగా అదే పేరుతో ప్రభాస్ సినిమా కూడా చేశాడు. ఇప్పుడు అదే టైటిల్‌ని తమ సినిమాకి పెట్టుకోవడానికి చాలా టెన్షన్ పడ్డామని చెబుతున్నాడు ప్రియదర్శి.
Also Read