Prabhas: మళ్ళీ మారిన ప్రభాస్ సినిమాల ఆర్డర్.. నెక్స్ట్ మూవీ స్పిరిట్ కాదు!
on Jan 29, 2026

ప్రభాస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ ఏది?
స్పిరిట్ కన్నా ముందే మరో సినిమా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేతిలో ప్రస్తుతం 'ఫౌజీ', 'స్పిరిట్', 'కల్కి-2' సినిమాలు ఉన్నాయి. 'ఫౌజీ' షూటింగ్ ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తి కాగా, 'స్పిరిట్' షూటింగ్ ఇటీవల మొదలైంది. 'కల్కి-2'ను కూడా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'స్పిరిట్' సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేయడంతో.. ప్రభాస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ ఇదేననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక 'ఫౌజీ' వెనక్కి వెళ్లినట్లేనని, 'స్పిరిట్' తర్వాతే అది విడుదలవుతుందని ప్రచారం జరిగింది. కానీ, ఫౌజీ విషయంలో ప్రభాస్ బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ఫౌజీ సినిమాని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టే బల్క్ కాల్షీట్లు ఇచ్చి, త్వరగా షూటింగ్ ఫినిష్ చేయడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నారు. (Fauzi Release Date)
ఈ ఏడాది సంక్రాంతికి 'ది రాజా సాబ్'తో అభిమానులను నిరాశపరిచారు ప్రభాస్. దానిని మర్చిపోయేలా ఇదే ఏడాది ఫౌజీతో అదరగొట్టాలని చూస్తున్నారట.
దీనిని బట్టి చూస్తే.. ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమాల ఆర్డర్.. స్పిరిట్, ఫౌజీ, కల్కి-2.
Also Read: సినిమాలకు బ్రేక్ ఇస్తున్న రామ్ చరణ్!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



