విజయ్ కి సెండ్ ఆఫ్ చెప్పిన పూజాహెగ్డే.. అసలు నిజం ఇదే!
on Jun 17, 2025

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే,(Pooja Hegde)అనతి కాలంలోనే టాప్ స్టార్స్ అందరితో నటించి అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. కాకపోతే 'అల్లు అర్జున్'(Allu Arjun)తో చేసిన 'అలవైకుంఠ పురం' తర్వాత వరుస ప్లాప్ లని ఎదుర్కోవడంతో కొంత కాలం నుంచి తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కనపడటం లేదు. ప్రస్తుతం తమిళ అగ్ర హీరో 'ఇళయ దళపతి విజయ్'(Vijay)తో 'జన నాయగాన్' చేస్తుంది.
సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉండే పూజా హెగ్డే రీసెంట్ గా జన నాయగాన్ గురించి పోస్ట్ చేస్తూ మూవీలోని తన క్యారక్టర్ కి సంబంధించిన చిత్రీకరణనని పూర్తి చేసుకున్నట్టుగా తెలిపింది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో 'జననయగాన్' అయన చివరి మూవీ అనే ప్రచారం జరుగుతుండటంతో, పూజాకి ఈ మూవీ తన కెరీర్ లో ఒక మెమొరీబిల్ మూవీ గా నిలిచే అవకాశం ఉంది.
పూజా లిస్ట్ లో ప్రస్తుతం రాఘవ లారెన్స్ అప్ కమింగ్ మూవీ కాంచన 4 తో పాటు మరో హిందీ మూవీ ఉంది. రజనీకాంత్, నాగార్జున కాంబోలో వస్తున్న 'కూలీ' లో గెస్ట్ రోల్ కూడా చేస్తున్న పూజా గత మే లో సూర్య తో కలిసి 'రెట్రో' తో సందడి చేసింది. ఇక జననయగాన్ లో మమిత బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కె వి ఎన్ ప్రొడకషన్స్ పై వెంకట్ కె నారాయణ, జగదీష్ పళని స్వామి, లోహిత్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా జనవరి 9 2026 న విడుదల కానుంది. హెచ్ వినోద్(H. Vinoth)దర్శకుడు.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



