ఆర్జీవీ, స్వప్నలపై కేసు.. తెలుగు రాష్ట్రాల నుంచి బహిష్కరించాలని డిమాండ్!
on Oct 20, 2025
రామ్‌గోపాల్‌వర్మ వివాదాలు కొత్తకాదు, పోలీస్ కేసులూ కొత్త కాదు. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు వర్మ. స్వప్న వ్యాఖ్యాతగా చేసిన ఒక కార్యక్రమంలో హిందూ దేవుళ్ళపై రామ్‌గోపాల్‌వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పురాణ ఇతిహాసాలను అవహేళన చేశారంటూ రాజమహేంద్రవరంలో కేసు నమోదైంది. న్యాయవాది, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ వీరిద్దరిపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును స్వీకరించిన పోలీసులు ఆర్జీవీ, స్వప్నలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇంటర్వ్యూలో యాంకర్ స్వప్న ఉద్దేశ పూర్వకంగానే వివాదాస్పద ప్రశ్నలు అడిగారని, దానికి కావాలనే ఆర్జీవీ విద్వేశపూరిత సమాధానాలు ఇచ్చారని శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి మృగాలను అడవిలోనే ఉంచాలని, తెలుగు రాష్ట్రాల నుంచి ఇలాంటి వారిని బహిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని అన్నారు. రామ్‌గోపాల్‌వర్మపై, అతన్ని సపోర్ట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేడా శ్రీనివాస్ కోరారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



