పవన్ కళ్యాణ్ కి రాత్రి అయితే హర్రర్.. ఆలోచనలో పడ్డ ఫ్యాన్స్
on May 2, 2024
ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా అందరి నోటా ఒకటే మాట. హరిహర వీరమల్లు ( hari hara veera mallu)టీజర్ సూపర్ గా ఉందని. ఇక ఫ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. పైగా షూటింగ్ త్వరగా కంప్లీట్ అవ్వాలని తమ ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థిస్తున్నారు. పవన్ కళ్యాణ్ (pawan kalyan) ఫ్యాన్స్ కదా.. అలాగే ఉంటుంది మరి. పైగా వీరమల్లు అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాని వెతకడం కూడా ప్రారంభించారు. దీంతో పవన్ కి సంబంధించిన న్యూస్ ఒకటి వాళ్ళల్లో సరికొత్త ఆలోచనలని కలిగిస్తుంది
పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం (pithapuram) అసెంబ్లీ స్థానం నుంచి ఎంఎల్ఏ గా పోటీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలలో భాగంగా రాత్రి పడుకునే ముందు ఎలాంటి సినిమాలు చూసేందుకు ఇష్టపడతారని పవన్ ని అడిగారు.దాంతో హారర్ సినిమా చూసేందుకు ప్రిఫర్ చేస్తానని చెప్పుకొచ్చాడు. పవన్ చెప్పిన ఈ సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఫ్యాన్స్ అయితే పవన్ హర్రర్ జోనర్ లో సినిమా చెయ్యాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మరి ఫ్యూచర్ లో పవన్ ఆ దిశగా అడుగులేస్తాడేమో చూడాలి. లేదా తన డైరెక్షన్ లో అయినా చేస్తాడో చూడాలి. ఎందుకంటే పవన్ కేవలం హీరోనే కాదు. ఒక రచయిత,దర్శకుడు కూడా. జానీ సినిమాకి తనే దర్శకుడు.మూవీ ఫలితం ఎలా ఉన్నా డైరెక్టర్ గా పవన్ కి మంచి పేరు వచ్చింది.హరి హర వీర మల్లు లో పేదల పక్షాన పోరాడే ఒక పోరాట యోదుడుగా కనిపించనున్నాడు. పవన్ నటిస్తున్న మొట్టమొదటి పీరియాడిక్ జోనర్ మూవీ ఇది. ఓజి,ఉస్తాద్ భగత్ సింగ్ లు కూడా లైన్ లో ఉన్నాయి
Also Read