మా అమ్మ ఆరోగ్యం బాలేదు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్!
on Oct 11, 2025

"మా అమ్మ ఆరోగ్యం బాలేదు. కొద్ది నెలలుగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు" అని అగ్ర కథానాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తాజాగా విజయవాడలో జరిగిన 'ఆమె సూర్యుడిని కబళించింది' పుస్తకావిష్కరణ వేడుకకు పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ, తన తల్లి అంజనమ్మ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
"మా మదర్ కి బాలేదు. చాలా నెలల నుంచి బెడ్ రెస్ట్ లో ఉన్నారు. మా అమ్మ మా కోసం ఎంతో నిలబడింది. ట్రాన్స్ఫర్స్ వల్ల ప్రతిసారీ స్కూల్స్ మారుతుంటే అలవాటు కావడానికి టైం పట్టేది. స్కూల్ కెళ్లిన కొత్తలో గొడవలు అయ్యేవి. 'నువ్వు భయపడి పారిపోకు. నిలబడు. నిన్ను పది దెబ్బలు కొడితే, నువ్వు తిరిగి ఒక దెబ్బ కొట్టు. లేదంటే ఈ ప్రపంచంలో బ్రతకలేవు' అని మా అమ్మ నాలో ధైర్యాన్ని నింపేది. వంటగది నుంచే ప్రపంచం మొత్తాన్ని గమనిస్తుంటుంది. మా అమ్మ అనే కాదు.. సగటు భారతీయ కుటుంబాల్లో ఉండే మహిళలు అందరూ ఇలాగే ఉంటారు. అలాంటి తల్లి దగ్గర నేను పెరిగాను." అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



