రిలీజ్ అయ్యాక కదా తెలిసేది శుభమా అశుభమా!
on Mar 13, 2025
నితిన్(Nithiin)శ్రీలీల(Sreeleela)జంటగా వెంకీ కుడుమల(Venki KUdumula)దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్(RobinHood)మార్చి 28 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో రాబిన్ హుడ్ పై నితిన్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.మేకర్స్ కూడా వినూత్న రీతిలో ప్రమోషన్స్ ని చేస్తు వస్తున్నారు.
అందులో భాగంగా నితిన్,వెంకీ కుడుమల రీసెంట్ గా ఒక వీడియో చెయ్యడం జరిగింది.అందులో వెంకీ కుడుమలని నితిన్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు.నితిన్ తన మొదటి ప్రశ్నగా హీరో తన ముందున్న ఫైటర్స్ ని కొడుతుంటే వెనుక ఉన్న ఫైటర్స్ అలాగే చూస్తుంటారు కానీ వాళ్ళు కూడా ఒకేసారి రావచ్చు కదా అని అడిగాడు.అందుకు వెంకీ మాట్లాడుతు అందరు ఒకేసారి వస్తే హీరోకి దెబ్బలు తగులుతాయని ఒక్కొక్కరిని పంపించమని ఏడి లకి చెప్తాం అని అన్నాడు.రెండవ ప్రశ్నగా హీరో ఉదయాన్నేలేచినపుడు చాలా అందంగా జుట్టు చెదిరిపోకుండా జెల్ ,స్ప్రే లతో ఫ్రెష్ గా ఎందుకు చేస్తారు అనగానే మీకు ఈ డౌట్ రాకూడదనే నా హీరోని రాత్రి పూటే అలా రెడీ చేసి పడుకోబెడతానుఅనడం.
సినిమాల్లో హీరోయిన్ అంటే నార్త్ ఇండియన్ నుంచి రావాలా అని అడగగానే ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయనే నేను సౌత్ హీరోయిన్లని నా సినిమాలో ఉంచుతాను.సినిమా అయిపోయాక శుభం కార్డు ఎందుకు వెయ్యటం లేదు.సినిమా రిలీజ్ అయ్యాక కదా తెలిసేది,శుభమా,అశుభమా అని వెంకీ కుడుమల అనడం ఇలా మరికొన్ని ప్రశ్నలతో ఇంటర్వ్యూ సరదాగా సాగింది.అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)నితిన్ కెరిరీలోనే అత్యంత భారీ వ్యయంతో రాబిన్ హుడ్ ని నిర్మిస్తుండగా జి వి ప్రకాష్ సంగీతాన్ని అందించాడు.రాజేంద్రప్రసాద్,షైన్ టామ్ చాకో,వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
