ENGLISH | TELUGU  

సింగిల్‌గా సోలో రిలీజ్‌కి రంగం సిద్ధం చేసుకుంటున్న బాలయ్య!

on Feb 10, 2026


- ఎన్‌బికె111లో బాల‌య్య ఎలాంటి క్యారెక్ట‌ర్ చేస్తున్నారో తెలుసా?

- సినిమా రిలీజ్ విష‌యంలో బాల‌య్య‌, గోపీచంద్ కొత్త ప్లానింగ్‌!

- ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని కొత్త జోన‌ర్‌లో బాల‌య్య సినిమా!


2023లో ‘వీరసింహారెడ్డి’తో బాక్సాఫీస్ దగ్గర వీరవిహారం చేశారు నటసింహ నందమూరి బాలకష్ణ. ఇప్ప్పుడు అదే కాంబినేషన్‌లో మరో సెన్సేషనల్ మూవీతో రాబోతున్న విషయం తెలిసిందే. బాలయ్యను మరో కొత్త యాంగిల్‌లో చూపించేందుకు గోపీచంద్ మలినేని కసరత్తు చేస్తున్నారు. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలు ప్రచారంలో ఉన్నాయి. 

 

వాస్తవానికి బాలయ్యతో తను చేసే రెండో సినిమాను ఎంతో భారీ స్థాయిలో చెయ్యాలనుకున్నారు గోపీచంద్. అందుకే మొదట చారిత్రక కథాంశాన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఆ కథకు భారీ బడ్జెట్ అవసరం అవుతుంది. అంతేకాదు, సినిమా పూర్తి కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇవన్నీ దష్టిలో పెట్టుకొని  ఆ స్క్రిప్ట్‌ను ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారు గోపీచంద్. బాలయ్యను ఒక కొత్త లుక్‌లో చూపించేందుకు పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ముంబాయి బ్యాక్‌డ్రాప్ ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కథ ఓకే అయిపోయిందని తెలుస్తోంది. 

 

నందమూరి బాలకష్ణ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో టచ్ చేయని డాన్ క్యారెక్టర్ ఈ సినిమాలో చెయ్యబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముంబాయి బ్యాక్‌డ్రాప్ అంటున్నారు కాబట్టి అది నిజమే అయి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఇటీవలికాలంలో ఎక్కువ సినిమాల్లో బాలయ్య డూయల్ రోల్ చేశారు. అయితే ఈ సినిమాలో మాత్రం సింగిల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అయినప్పటికీ మోస్ట్ పవర్‌ఫుల్‌గా ఈ క్యారెక్టర్‌ని డిజైన్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు, ఇంతకుముందు కంటే స్టైలిష్ గా ఈ సినిమాలో బాలయ్య కనిపిస్తారట. 

 

బాలయ్య మెయిన్ పవర్ డైలాగ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు, అభిమానులు ఒక రేంజ్‌లో ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమాలోని డైలాగులు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా జరుగుతోంది. మార్చి మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి శరవేగంగా చిత్రాన్ని కంప్లీట్ చెయ్యాలని ప్లాన్ చేశారు గోపీచంద్ మలినేని. 

 

2023 సంక్రాంతికి వీరసింహారెడ్డి, 2025 సంక్రాంతికి డాకు మహరాజ్ చిత్రాలతో సందడి చేసిన బాలయ్య.. ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగలేదు. గోపీచంద్ మలినేనితో బాలయ్య చేస్తున్న తన 111వ సినిమాని మొదట సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. సంక్రాంతి సీజన్ అనేసరికి టాలీవుడ్ టాప్ హీరోలంతా పండగకే రావాలనుకుంటారు. అయితే ఈసారి బాలయ్య సోలోగా రావాలని డిసైడ్ అయ్యారట. అందుకే డిసెంబర్‌లోనే సినిమాను రిలీజ్ చేసే విధంగా ప్లానింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.