ఆ దర్శకుల సినిమాలో నటించాలంటే ఎలా అంటున్న నాగ చైతన్య
on Nov 29, 2023
ప్రస్తుతం యువ నటుడు అక్కినేని నాగ చైతన్య మంచి జోరు మీద ఉన్నాడు. కొన్ని రోజుల్లో అంటే డిసెంబర్ 1 న దూత వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కెరీర్ లో మొదటి సారిగా ఒక జర్నలిస్ట్ పాత్రలో చై దూత లో కనిపించబోతున్నాడు. ఇటీవలే వచ్చిన దూత ట్రైలర్ కూడా మూవీ మీద అంచనాలు పెంచింది. అలాగే తండేల్ అనే మూవీ ని కూడా చై స్టార్ట్ చేసాడు. ఇటీవల వచ్చిన తండేల్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియా లో రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా చై ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నాకు పలానా దర్శకులతో పని చెయ్యాలని ఉందని చెప్పాడు.
చై మాట్లాడుతూ నాకు సంజయ్ లీలా బన్సాలి, రోహిత్ శెట్టి, అనురాగ్ కశ్యప్, ఆయాన్ ముఖర్జీ లాంటి దిగ్గజ దర్శకుల చిత్రాల్లో నటించాలనే కోరిక ఉందని చెప్పాడు. ఆ దర్శకులు తెరెకెక్కించిన సినిమాలన్ని నాకు చాలా ఇష్టమని అలాంటి దర్శకుల సినిమాలో నటించే అవకాశం వస్తే నటుడుగా తన సత్తా చాటుతానని కూడా చై చెప్పాడు. అయాన్ దర్శకత్వంలో వచ్చిన వేక్ అప్ సిద్ మూవీ తన ఫేవరెట్ మూవీ అని రోహిత్ శెట్టి కామెడీ అంటే కూడా చాలా ఇష్టమని చైతన్య తన మనసులో భావాన్ని చెప్పాడు.
ఇప్పుడు చైతన చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. చై అభిమానులు అలాగే సినీ అభిమానులందరు కూడా చైతన్య కోరుకుంటున్నట్టే ఆ దర్శకుల్లో ఎవరో ఒక దర్శకుడు సినిమాలో చైతన్య చేస్తే చై అగ్ర హీరోగా ఎదగడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే చై చేసిన సినిమాలు కొన్ని ఫెయిల్ అయ్యాయి కానీ నటుడుగా మాత్రం చై ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదని అంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
