మంచు వారి భక్తకన్నప్ప లో మెగాస్టార్
on Sep 30, 2023
మంచు మోహన్ బాబు..భక్తవత్సల నాయుడు నుంచి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గా ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం..మోహన్ బాబు డైలాగ్ చెప్తే థియేటర్స్ మొత్తం ఈలలు కేకలతో దద్దరిల్లి పోవలసిందే. తన 40 ఏళ్ళ సినీ చరిత్రలో ఆయన చూడని సినీ రికార్డు లేదు.ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి లక్షలాది అభిమానులని సంపాదించాడు.ఆ తర్వాత ఆయన వారసులు ఆయన లెగసి ని ముందుకు తీసుకెళ్లడంలో అంతగా విజయం సాధించలేక పోయారు.కానీ ఇప్పుడు ఆయన వారసుడు మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా భక్త కన్నప్ప అనే మూవీ ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఈ ప్రాజెక్ట్ లో మెగాస్టార్ నటించబోతున్నారు అనే వార్త సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది.
మోహన్ బాబు నట వారసుడుగా చిత్ర రంగ ప్రవేశం చేసిన మంచు విష్ణు మంచి నటుడు అనే గుర్తింపుని తెచ్చుకున్నాడు.కెరియర్ ప్రారంభంలో హిట్లు కొట్టిన విష్ణు ఆ తర్వాత ప్లాపుల భారిన పడ్డాడు. తాజాగా కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత పరమేశ్వరుడి పరమ భక్తుడైన భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కతున్న భక్త కన్నప్ప అనే సినిమా లో టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు. మంచు మోహన్ బాబు ఈ సినిమాని స్వయంగా నిర్మిస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమా లో నటించే ఒక నటుడికి సంబంధించిన వార్త సినీ సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తుంది.మలయాళ చిత్ర సీమలో మెగా స్టార్ గా కీర్తించబడే మోహన్ లాల్ భక్త కన్నప్ప సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నాడు .ఈ మేరకు మోహన్ లాల్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని చిత్ర బృందం తెలిపింది.మోహన్ లాల్ కి బాష తో సంబంధం లేకుండా అన్ని లాంగ్వేజ్ ల్లో ను అభిమానులు ఉన్నారు.ఇప్పుడు మోహన్ లాల్ భక్త కన్నప్ప మూవీలో యాక్ట్ చెయ్యబోతున్నాడనే వార్తతో సినిమా లో ఇంక ఏ ఏ హీరోలు నటిస్తారో అని సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
