చైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణం.. తెలంగాణ మంత్రి సంచలనం!
on Oct 2, 2024
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రస్తుత మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు.
"కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు అహంకారంతో ఎంతోమంది సినిమా యాక్టర్ల జీవితాలతో ఆడుకున్నాడు. వారిని డ్రగ్స్ కేసుల్లో ఇరికించి, ఆయన మాత్రం పక్కకి తప్పుకున్నాడు. ఒక రకంగా నాగచైతన్యకు విడాకులు కావడానికి కారణం కూడా కేటీఆరే." అని కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కాగా, గత ప్రభుత్వంలో తెలంగాణలో పలువురి ఫోన్ లు అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కి బలైన వారిలో చైతన్య, సమంత కూడా ఉన్నారని వార్తలొచ్చాయి. ముఖ్యంగా దీని వెనక కేటీఆర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా కొండా సురేఖ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.
Also Read