సినిమా చెయ్యాలంటే డ్రగ్స్ వాడమని సంతకం చెయ్యాలి.. ఇది నిజంగా సంచలనమే
on Jun 21, 2025

విభిన్నమైన చిత్రాలని నిర్మించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది. ఏ చిత్ర పరిశ్రమ అయినా, మలయాళ సినిమాలని తమ భాషల్లోకి రీమేక్ చేస్తుంటాయి. కానీ మలయాళ చిత్ర పరిశ్రమ పరబాషా చిత్రాలని రీమేక్ చెయ్యడం జరగదు. దీన్ని బట్టి మలయాళ చిత్ర పరిశ్రమ యొక్క గొప్పతనాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ గత కొన్ని నెలల నుంచి మలయాళ చిత్ర పరిశ్రమలో పేరు పొందిన బడా నటులు, టెక్నీషియన్స్ షూటింగ్ లొకేషన్ లోనే 'డ్రగ్స్' వాడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా ఒక రూమ్ ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీన్ని బట్టి డ్రగ్స్ వాడకం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో మలయాళ చిత్ర నిర్మాత మండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి నటీనటులతో పాటు, టెక్నీషియన్స్ ఒక సినిమాకి ఓకే చెప్పి, షూటింగ్ కి వెళ్లే ముందు సెట్స్ లో డ్రగ్స్ ఉపయోగించమనే కొత్త అఫిడవిట్ పై సంతకం చెయ్యాలి. వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్ కూడా డ్రగ్స్ ని ముట్టుకోము అని సంతకం చెయ్యాలి. సూపర్ స్టార్స్ నుంచి చిన్నస్థాయి టెక్నీషియన్స్ వరకు ఈ రూల్ వర్తిస్తుంది. ఆ విధంగా సంతకం చేస్తేనే సెట్స్ లోకి అడుగుపెడతారు. లొకేషన్ తో పాటు నిర్మాణాంతర పనులు జరిగే ప్రదేశాల్లోనే ఈ నిబంధన వర్తిస్తుంది. నిర్మాత మండలి తీసుకున్న ఈ నిర్ణయానికి ఇండస్ట్రీకి చెందిన అన్ని విభాగాల వారు మద్దతు తెలిపారు.
దీంతో భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం డ్రగ్స్ నిరోధించే విషయంలో, మలయాళ చిత్ర పరిశ్రమని ఫాలో అవ్వాలని పలువురు కోరుతున్నారు. కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ కేసులో అగ్ర నటుడు 'షైన్ టామ్ చాకో'(Shine Tom Chacko)తో పాటు మరికొంత మంది నటులు అరెస్ట్ అయ్యారు. దీంతో మలయాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమలో డ్రగ్స్ వాడకాన్ని నిర్మూలించాలనే పట్టుదలతో ఉంది. షైన్ తెలుగులో పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో కనపడిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



