అఖిల్ అక్కినేని స్పెషల్ స్టంట్స్..అంతా మీకోసమేగా
on May 21, 2025
'అఖిల్ అక్కినేని'(Akhil Akkineni)తన అప్ కమింగ్ మూవీ 'లెనిన్'(Lenin)ని 'మురళి కిషోర్ అబ్బూరు'(Murali Kishor Abburu)దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. రాయలసీమలోని చిత్తూరు ప్రాంత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అఖిల్ మరియు అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆల్రెడీ రిలీజైన ప్రచార చిత్రాలతో పాటుగా అఖిల్ లుక్ డిఫరెంట్ గా ఉండటంతో లెనిన్ పై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.
రీసెంట్ గా ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం జూన్ మొదటి వారంలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో క్లైమాక్స్ ను ఘాట్ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్లైమాక్స్ లో అఖిల్ కొన్ని స్పెషల్ స్టంట్స్ చేయబోతున్నాడని, మూవీ రిలీజ్ అయ్యాక అఖిల్ చేసే స్టంట్స్ కి థియేటర్ లో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు విజిల్స్ వేస్తారని కూడా తెలుస్తుంది. అనంతరం అఖిల్ పై ఒక సాంగ్ ని భారీగా వేసిన సెట్ లో చిత్రీకరిస్తారని, దీంతో మూవీ దాదాపుగా పూర్తయినట్టే అని అంటున్నారు.
రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న లెనిన్ లో శ్రీలీల(Sreeleela)హీరోయిన్గా చేస్తుండగా, పరిశ్రమకి చెందిన పలువురు అతిరధ మహారధులు కీలక పాత్రల్లో చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్,సితార ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా అఖిల్ కెరిరీలోనే భారీ వ్యయంతో లెనిన్ ని నిర్మిస్తున్నారు. విజయదశమి(VIjayadasami)కానుకగా థియేటర్స్ లోకి తీసుకురావాలనే యోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
