కుబేర మాస్ బ్యాటింగ్..రెండు రోజుల్లోనే 50 కోట్లు.. కానీ?
on Jun 22, 2025
నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కుబేర'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న కుబేర.. అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.
కుబేర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టగా, రెండో రోజు కూడా అదే జోరు చూపిస్తూ దాదాపు రూ.23 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా సుమారు రూ.53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మూడు రోజు ఆదివారం కావడంతో మరో రూ.25 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం జోరు చూస్తుంటే మొదటి వారంలోనే వంద కోట్ల క్లబ్ లో చేరుతుంది అనడంలో సందేహం లేదు.
అయితే తెలుగుతో పోలిస్తే తమిళ కలెక్షన్స్ డిజప్పాయింట్ గా ఉన్నాయి. తమిళ హీరో ధనుష్ నటించినప్పటికీ.. అక్కడి ప్రేక్షకులు తమ సినిమాలా దానిని పూర్తిగా ఓన్ చేసుకోవట్లేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లోనే రూ.24 కోట్లు రాబడితే.. తమిళనాట రూ.9 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది. అంటే తెలుగు వసూళ్ళలో కనీసం సగం కూడా లేవు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
