అల్లు అర్జున్ గొంతు బాగుంటుంది..పెళ్లి చేసుకోవాలని ఉంది
on May 10, 2024
కోవై సరళ అంటే తెలియని దక్షిణ భారతీయ చలన చిత్ర ప్రేక్షకుడు లేడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి సుమారు 900 చిత్రాలకి పైగా చేసింది.హీరోయిన్ గాను కమల్ హాసన్ వంటి లెజండ్రీ యాక్టర్ తో నటించింది. తాజాగా ఆమె అల్లు అర్జున్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది
క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్, ఎవడి గోల వాడిది,పెళ్ళాం ఊరెళితే, కాంచన, బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్, నేనింతే, దేశముదురు, మృగరాజు, సతీలీలావతి, శ్రీరామచంద్రులు ఇలా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది. ఎని మూవీని తీసుకున్నా తన క్యారక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ మాత్రం ఒక లెవల్లో ఉంటుంది.స్క్రీన్ మీద ఆమె చెప్పే డైలాగ్ బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకి నవ్వుల వానలో తడిసి ముద్దవడం ఖాయం. అసలు సినిమాలో ఉందని కోవై సరళ ఉందని వెళ్లే ప్రేక్షకులు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఒక టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఒక ఆసక్తి కర విషయాన్నీ వెల్లడించింది. ఇప్పుడున్న హీరోల్లో ఎవర్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అని యాంకర్ అడిగాడు. అప్పుడు ఆమె అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పింది. ఆయన గొంతు చాలా బాగుంటుంది. ప్రవర్తన కూడా చాలా బాగుంటుందని చెప్పింది. బన్నీ తో కలిసి గంగోత్రి, దేశ ముదురులో చేసింది
ఇక కోవై సరళ ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి మీద తనకి ఇంట్రస్ట్ లేదని కూడా చెప్పింది, ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే పోతాం అని తాత్విక వేత్తల మాట్లాడుతుంది.తమిళ సినిమాల కంటే తెలుగు సినిమాలే ఎక్కువ ఇష్టమని చెప్తుంది. ఎందుకంటే తమిళ పరిశ్రమ నాకు పుట్టిల్లు అయితే తెలుగు మెట్టినిల్లు. అలాంటప్పుడు మెట్టినిల్లే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి కదా అని చెప్తుంది. ప్రస్తుతం సినిమాలు అయితే తగ్గుముఖం పట్టాయి
Also Read