రిలీజ్ కి ముందు రోజు షాకిచ్చిన 'కింగ్డమ్' టీమ్!
on Jul 30, 2025

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కింగ్డమ్' (Kingdom). భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా, విజయ్ సోదరుడి పాత్రలో సత్యదేవ్ నటించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం రేపు(జులై 31) థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఓ మంచి భారీ యాక్షన్ సినిమాని చూడబోతున్నామనే నమ్మకాన్ని కలిగించాయి. విజయ్ అభిమానులు, ప్రేక్షకులు కూడా అవే అంచనాలతో ఉన్నారు. ఇలాంటి సమయంలో మూవీ టీమ్ ట్విస్ట్ ఇచ్చింది.
'కింగ్డమ్' విడుదల నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో విజయ్, ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు. ఇది పూర్తిస్థాయి యాక్షన్ సినిమా కాదని, ఆడియన్స్ రాంగ్ ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్ కు రాకూడదనే ఉద్దేశంతో ఇది చెబుతున్నామని అన్నారు. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తీసిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇదని, ఇందులో ఆయన శైలి ఎమోషన్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు.
ఇప్పటిదాకా 'కింగ్డమ్'ని ఒక యాక్షన్ సినిమాగానే ప్రేక్షకులు చూశారు. అయితే ఇందులో యాక్షన్ కంటే ఎమోషన్స్ కి పెద్ద పీట వేసినట్లు తాజాగా మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. టీమ్ చెబుతున్నట్టుగా ఇందులో ఎమోషన్స్ వర్కౌట్ అయితే.. కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



