కేజీఎఫ్ చాప్టర్ 3 బిగిన్..రాఖి భాయ్ చనిపోలేదు
on Sep 30, 2023
రాకింగ్ స్టార్ యష్ హీరోగా కెజిఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2 లు ఎంతటి ఘన విజయం సాధించాయో భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరికి తెలిసిన విషయమే. అలాగే కెజిఎఫ్ రెండు భాగాలు కూడా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎన్నో సరికొత్త రికార్డులని సృష్టించాయి.ఇప్పుడు కెజిఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఒక వార్త యష్ అభిమానులతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులని ఆనందంలో ముంచెత్తుతుంది.
కొన్ని సినిమాలు మన మైండ్ లో నుంచి ఆంత త్వరగా వెళ్లిపోవు .ఎన్ని సంవత్సరాలు దాటినా సరే ప్రేక్షకులు ఆ చిత్రాన్ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు.అలా గుర్తుండిపోయే సినిమాల్లో ఒక సినిమానే కెజిఎఫ్ సినిమా. ఇప్పటివరకు విడుదలైన రెండు పార్ట్ లు కూడా ఘన విజయం సాధించడంతో పాటు ఎంతో మంది హీరోలు దర్శకులు భారీ సినిమాలు తియ్యడానికి కెజిఎఫ్ సిరీస్ దోహదం చేసింది.యష్ యొక్క నట విశ్వరూపంతో పాటు ప్రశాంత్ నీల్ డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకత్వం కెజిఎఫ్ చాప్టర్ 1 ,2 లని సూపర్ డూపర్ హిట్ చేసింది. ఇంక అసలు విషయానికి వస్తే ఇప్పుడు యష్ అండ్ సినిమా అభిమానులని ఆనందం లో ముంచెత్తేలా కెజిఎఫ్ చాప్టర్ 3 రాబోతుందని సాక్షాత్తు కెజిఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ హోంబులే ప్రకటించింది. చాప్టర్ 1 లో కెజిఎఫ్ కి కింగ్ అయిన రాఖీ భాయ్ ,చాప్టర్ 2 లో చనిపోయినట్టుగా చూపించారు. మరి కెజిఎఫ్ 3 లో కథ ఎలా ఉండబోతుందో అని కెజిఎఫ్ ఫాన్స్ చాలా ఉత్సుహకతో ఉన్నారు.చాప్టర్ 2 లో రాఖి భాయ్ చనిపోలేదేమో అని అందరు చర్చించుకుంటున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
