కన్నప్ప మాటల రచయిత సంచలన లేఖ..శివుడే వాళ్ళ సంగతి చూసుకుంటాడు
on Jun 19, 2025

శ్రీ కాళహస్తి'(Srikalahasti)లో వాయులింగ రూపంలో కొలువు తీరిన శ్రీకాళహస్తీశ్వరుడికి, తిన్నడు అనే ఒక ఆటవికుడికి మధ్య జరిగిన చారిత్రక కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'కన్నప్ప'(Kannappa). నాస్తికుడైన తిన్నడే, ఆ తర్వాత కన్నప్ప గా ఎలా మారాడు అనేది కూడా ఈ చిత్రంలో చెప్పడం జరిగింది. 'కన్నప్ప' గా 'విష్ణు'(Vishnu)తన నట విశ్వరూపాన్ని చూపించాడని సెన్సార్ సభ్యులు చెప్పినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినపడుతుంది.
రీసెంట్ గా 'కన్నప్ప' కి మాటల రచయితగా పని చేసిన 'ఆకెళ్ళ శివ ప్రసాద్'(Akella Sivaprasad)ఒక నోట్ ని రిలీజ్ చేసాడు. అందులో 'నా పేరు శివ ప్రసాద్ ఆకెళ్ళ. కన్నప్ప కి మాటల రచయితగా పని చేశాను. కన్నప్ప మీద జరుగుతున్న దుష్ప్రచారం నన్ను చాలా బాధిస్తుంది. నేను బ్రాహ్మణుడిని, దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్(Mukeshkumar Singh)ఉత్తరాది బ్రాహ్మణుడు. మహాభారతాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకులు ఆయన. కన్నప్ప లో బ్రాహ్మణుల్ని గాని, ఏ ఇతర కులాల వారిని గాని కించపరచలేదు. గతంలో కన్నప్ప జీవిత కథతో వచ్చిన కన్నడ కంఠీరవ 'రాజ్ కుమార్' గారి 'శ్రీ కాళహస్తి మహత్యం', రెబల్ స్టార్ 'కృష్ణంరాజు' గారు చేసిన 'భక్త కన్నప్ప లో కాళహస్తీశ్వరుడి గుడి ప్రధాన పూజారి మహాదేవ శాస్త్రి పాత్రని గుడిలో నగలు తీసుకెళ్లి తన ఉంపుడు గత్తెకి ఇవ్వడం చూపించారు. కానీ మంచు విష్ణు గారు 'కన్నప్ప' కి కథా రచన కూడా చేసి మహాకవి 'దూర్జటి'(Durjati)16 వ శతాబ్దంలో రచించిన 'కాళహస్తి మహత్యం' గ్రంధం ఆధారంగా చేసుకొని 'మహాదేవశాస్త్రి' పాత్రని మహా శివభక్తుడిగా ఉన్నతంగా చూపించారు. ఈ క్యారక్టర్ ని మోహన్ బాబు గారు అత్యద్భుతంగా పోషించారు. ఈ చిత్ర కథని రాస్తున్నప్పుడే కాకుండా, పూర్తి చేసాక కూడా శ్రీ కాళహస్తి దేవస్థానంకి చెందిన ప్రధాన అర్చకులకి చూపించడం జరిగింది. చిత్రం ఎంతో ఉన్నతంగా ఉందని విష్ణు, మోహన్ బాబుని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ చిత్రంలో పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రితో పాటు చాలా మంది బ్రాహ్మణులు వివిధ శాఖల్లో పని చేసారు. ఏ వర్గం వారిని కించపర్చడానికి కోట్లు కోట్లు పెట్టి సినిమాలు నిర్మించరు. కన్నప్ప ఇంకా విడుదల కాకుండానే ఏవేవో వదంతులు పుట్టించి, దుష్ప్రచారం చేస్తున్న వారి విషయం ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడని సదరు నోట్ లో తెలిపాడు.
ఈ మూవీలో 'పిలక’, ‘గిలక’అనే బ్రాహ్మణ క్యారెక్టర్స్ ని ప్రముఖ కామెడీ నటులు బ్రహ్మానందం,సప్తగిరి పోషించారని, దీంతో వాళ్ళిద్దరి పాత్రల పేర్లు బ్రాహ్మణ సమాజాన్ని,సనాతన ధర్మాన్ని కించపరిచేలా ఉన్నాయని,కొంత మంది బ్రాహ్మణ ప్రతినిధులు హైకోర్టులో కేసు వెయ్యడం జరిగింది. దీంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, సీబీఎఫ్‌సీ సీఈవో, సీబీఎఫ్‌సీ అధికారి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, కన్నప్ప దర్శకుడు ముఖేష్‌కుమార్ సింగ్, నిర్మాతలుగా వ్యవహరించిన మోహన్‌బాబు, విష్ణుతో పాటుగా, బ్రహ్మానందం, సప్తగిరికి కోర్టు నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణని ఆగస్టు 1కి వాయిదా వేసింది కన్నప్పట్రైలర్ ఒక రేంజ్ లో ఉండటంతో సినిమా గ్యారంటీ హిట్ అని అభిమానులతో పాటు ప్రేక్షకులు నమ్ముతున్నారు. ప్రభాస్(Prabhas)మోహన్ లాల్(Mohan lal)అక్షయ్ కుమార్(Akshay Kumar)మోహన్ బాబు(Mohan Babu)శరత్ కుమార్(Sarath Kumar)వంటి మేటి నటులు కూడా కన్నప్ప లో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో అదనపు క్రేజ్ కూడా వచ్చింది. ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా చేస్తుండగా కాజల్ అగర్వాల్ పార్వతి దేవిగా కనిపిస్తుంది. విష్ణు, మోహన్ బాబు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అత్యంత భారీ వ్యయంతో 'కన్నప్ప' ని నిర్మించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



