నా భార్య కొడుతుంది.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ప్రముఖ నటుడు
on Jan 7, 2026

-ఆ నటుడు భార్య పై ఏమని కంప్లైంట్ చేసాడు
-కొట్టడం నిజమేనా
-ఆమె అలా చెయ్యడానికి కారణం
-మరి పోలీసులు ఏమన్నారు
భార్యలని చిత్ర హింసలకి గురి చేసే భర్తలే కాదు. భర్తల్ని చిత్ర హింసలకి గురి చేసే భార్యలు కూడా ఉంటారనే వార్తల్ని నిత్యం వింటుంటాం. ఇప్పడు ఆ బాధిత భర్త పోస్ట్ లో ఒక సినీ నటుడు చేరాడు. దీంతో సదరు న్యూస్ సౌత్ సినీ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లోనే వైరల్ గా మారింది.
కన్నడ చిత్ర సీమలో ధనుష్ రాజ్(Dhanush Raj)కి సుదీర్ఘమైన సినీ నేపధ్యం ఉంది. ఎన్నో హిట్ సినిమాల్లో కూడా చేశాడు. రీసెంట్ గా ధనుష్ రాజ్ బెంగుళూరు లోని గిరి నగర్ పోలీస్ స్టేషన్ లో తన భార్య అర్షిత(arshitha)పై ఫిర్యాదు చేసాడు. సదరు ఫిర్యాదులో 'నా భార్య సరైన సమాచారం ఇవ్వకుండా విదేశాలకి వెళ్ళింది.ఎందుకు చెప్పకుండా వెళ్లావని అడిగితే నన్ను కొట్టడమే కాకుండా వేధింపులకి గురి చేస్తుంది. నాపై గుండాలని పంపి చంపిస్తానని అంటుండడంతో పాటు ఒకసారి తనంతట తానే గాయపరుచుకొని నేను చేసానని సృష్టించింది. టోటల్ గా నా భార్య వాళ్ళ ఎంతో మనో వేదనకి గురవుతున్నానని ధనుష్ రాజ్ తన ఫిర్యాదు లో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
2008 వ సంవత్సరం నుంచే కన్నడ చిత్ర సీమలోనే ఉన్న ధనుష్ రాజ్ బొంబాట్, సంగమ, సర్కస్ శివాజి సూరత్ కల్ వంటి చిత్రాల్లో కనిపించాడు. సీరియల్స్ లోను తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



