షారుక్ 'జవాన్' 2 వారాల కలెక్షన్స్.. రూ. 1000 కోట్లు పక్కా!
on Sep 21, 2023
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తండ్రీకొడుకులుగా నటించిన 'జవాన్' చిత్రం.. రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరే దిశగా పయనిస్తోంది. సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా.. బుధవారంతో 14 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. ఈ 14 రోజుల్లో రూ. 922. 05 కోట్ల గ్రాస్ చూసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. ఇదే జోరు వచ్చే వీకెండ్ వరకు కొనసాగిస్తే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమి కాదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
ఏరియాల వారిగా 'జవాన్' 14 రోజుల కలెక్షన్స్ వివరాలు:
తెలుగు రాష్ట్రాలు: రూ.53. 35 కోట్ల గ్రాస్
తమిళనాడు : రూ.44. 15 కోట్ల గ్రాస్
కర్ణాటక: రూ. 47. 75 కోట్ల గ్రాస్
కేరళ: రూ. 13.15 కోట్ల గ్రాస్
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 465. 10 కోట్ల గ్రాస్
ఓవర్సీస్: రూ.298.55 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా 14 రోజుల కలెక్షన్స్ : రూ.922.05 కోట్ల గ్రాస్
హిందీ వెర్షన్ 14 రోజుల నెట్: రూ. 466. 19 కోట్లు

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
