జగదేకవీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ ఖర్చు ఎంత!
on May 6, 2025
మెగాస్టార్ 'చిరంజీవి(Chiranjeevi)శ్రీదేవి(sridevi)జంటగా నటించిన చిత్రం 'జగదేకవీరుడు అతిలోకసుందరి'(Jagadeka veerudu athiloka sundari) దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పై అశ్వనీదత్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించాడు. 1990 మే 9 న ప్రేక్షకుల ముందుకు రాగా భారీ విజయాన్ని అందుకుంది. తుఫాన్ ని సైతం తట్టుకొని భారీ కలెక్షన్స్ ని రాబట్టి చిరంజీవి, శ్రీదేవి, రాఘవేంద్రరావు, అశ్వనీదత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
2025 మే 9 కి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రీ రిలీజ్ కాబోతుంది. 2 డి, 3 డి వెర్షన్ తో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. దీంతో ఈ చిత్రాన్నిప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో అశ్వని దత్ కూతుళ్లు ప్రియాంక దత్, స్వప్న దత్ కొంత మంది టెక్నీషయన్స్ తో కలిసి ఒక వీడియో చేసారు. ఆ వీడియోలో వాళ్లంతా మాట్లాడుతు 'జగదేక వీరుడు అతిలోకసుందరి నెగిటివ్ పూర్తిగా డి కంపోజ్ అయ్యింది. 2018 వ సంవత్సరం నుంచి రీల్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని థియేటర్స్ లో ఎంక్వయిరీ చేస్తుంటే 2021 లో విజయవాడలో ప్రింట్ దొరికింది. ప్రతి రీల్ ని చెక్ చేసి ఏ పోర్షన్ బాగుంది ఏ పోర్షన్ బాగోలేదని చూసాం. డస్ట్ ని కూడా క్లియర్ చేసి స్కానింగ్ లో రన్ చేసాం.ప్రేక్షకులకి ఒక అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ ఇవ్వడం కోసం 8 k సౌండ్ కి సెట్ చేశామని చెప్పుకొచ్చారు.
ఈ విధంగా రీ రిలీజ్ కోసం మేకర్స్ సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి, శ్రీదేవితో పాటు అమ్రిష్ పూరి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, గొల్లపూడి మారుతీ రావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతంలో వచ్చిన అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
