ఆస్తులు తాకట్టు పెట్టిన హీరో
on May 1, 2025
స్టార్ హీరోలందరితో జత కట్టి అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన భామ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Peet Singh). హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసిన రకుల్ ఆ తర్వాత ప్రముఖ హీరో, నిర్మాత జాకీ భగ్నానీ(jackky Bhagnani)ని వివాహం చేసుకుంది. 2009 లో వచ్చిన 'కల్ కిస్ నే దేఖ' అనే చిత్రంతో హీరోగా, నిర్మాతగా పరిచయమైన జాకీ ఆ తర్వాత తొమ్మిది సినిమాల వరకు నటించాడు. నిర్మాతగా దిల్ జంగిల్, వెల్ కమ్ టూ న్యూయార్క్, కూలీ నెంబర్ 1 , బెల్ బోటమ్, మిషన్ రాణి గంజ్ వంటి పలు చిత్రాల్ని నిర్మించగా, గత ఏడాది 'బడే మియాన్, చోటేమియాన్'(Bade MIyan Chote Miyan)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం చెందింది.
రీసెంట్ గా జాకీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు బడే మియాన్, చోటేమియాన్ కి భారీ స్థాయిలో ఖర్చు పెట్టాం. ఎన్నో ఇబ్బందులు పడుతు ఆస్తులు కూడా తాకట్టు పెట్టాను. కానీ రిలీజ్ అయ్యాక యాభై శాతం కంటే తక్కువే వసూలు చేసింది. కానీ నాకు జీవితంలో అతి పెద్ద గుణపాఠం నేర్పింది. ఒక ప్రాజెక్టు ని భారీ స్థాయిలో తెరకెక్కించడం ఒకటే ముఖ్యం కాదు. కంటెంట్ బాగుండాలని, మా మూవీ కంటెంట్ తో ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని తెలుసుకున్నాను. అందుకే భవిష్యత్తులో ప్రేక్షకులకి నచ్చే సినిమాలు నిర్మిస్తానని చెప్పుకొచ్చాడు.
వేసవి కానుకగా ఏప్రిల్ 11 2024 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన బడే మియాన్, చోటేమియాన్ లో అక్షయ్ కుమార్(Akshay kumar)టైగర్ ష్రఫ్(Tiger Shroff)పృథ్వీ రాజ్ సుకుమారన్, మానుషీ చిల్లర్, అలయా ఎఫ్, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. అలీ అబ్బాస్ జాఫర్(Ali abbas jafar)దర్శకుడిగా వ్యవహరించాడు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా 102 .16 కోట్లు మాత్రమే వసూలు చేసిందనేది సినీ విశ్లేషకుల అంచనా.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
