ఆర్య ఇంట్లో ఐటి సోదాలు.. ఆ రెస్టారెంట్ లో కూడా
on Jun 18, 2025
రెండు దశాబ్దాల నుంచి తమిళ చిత్ర సీమలో విభిన్న జోనర్ కి సంబంధించిన సినిమాల్లో నటిస్తూ అశేష అభిమానులని సంపాదించుకున్న హీరో ఆర్య(Arya). ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆర్య ఖాతాలో ఉన్నాయి. తాజాగా చెన్నై(Chennai)లోని ఆర్య నివాసంలో ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆర్య కి సంబంధించి అన్నా నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న 'సీ షెల్' రెస్టారెంట్ ల పై కూడా సోదాలు జరిపి పలు డాక్యుమెంట్స్ ని చెక్ చేస్తున్నారు. పన్ను ఎగవేత కారణమగానే అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంపై ఆర్య అక్కడి స్థానిక మీడియాతో మాట్లాడుతు 'సీ షెల్'(C shell)రెస్టారెంట్లతో నాకు సంబంధం లేదు. వీటి నిర్వహణ బాధ్యతని నేను కొన్నేళ్ల క్రితం వేరే వ్యక్తికి అప్పగించానని చెప్పడం జరిగింది. ఆర్య ప్రస్తుతం 'అనంతన్ కాదు' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులని అన్వయిస్తూ, సరికొత్త కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ కి అభిమానులు, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మూవీపై అంచనాలు కూడా పెరిగాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
