వాళ్లు సర్వనాశనం అయిపోతారంటున్న ఇంద్రజ.. వాళ్ళు వీరే
on Dec 6, 2025
.webp)
-బాలకృష్ణ తో జోడి కట్టిన రికార్డు
-ఇంద్రజ ఏం చెప్తుంది
-సదరు వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి
సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా 'ఇంద్రజ'(Indraja)సినీ జర్నీకి ప్రత్యేమైన గుర్తింపు పొందింది. ఇండస్ట్రీ లో కి అడుగుపెట్టిన కొంత కాలానికే గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna) సరసన నటించే అవకాశాన్ని సంపాదించిందంటే ఇంద్రజ నటప్రభావం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు . సూపర్ స్టార్ కృష్ణ(Krishna)తో జోడి కట్టిన రికార్డు కూడా ఇంద్రజ సొంతం. తన సెకండ్ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తున్న ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెర పై ప్రసారమవుతున్న'శ్రీదేవి డ్రామా కంపెనీ' కి జడ్జి గా వ్యవహరిస్తు అభిమానులని, ప్రేక్షకులని అలరిస్తు వస్తుంది. రీసెంట్ గా సదరు షో కి సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా ఇంద్రజ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
ఇంద్రజతో షో యాంకర్ మాట్లాడుతు 'ఈ తరం యువత ప్రేమ, బ్రేకప్ ని చాలా ఈజీగా తీసుకుంటుందనే ప్రశ్నని సంధించింది. అప్పుడు ఇంద్రజ మాట్లాడుతు ఒక మహిళ ప్రసవ సమయంలో అత్యంత తీవ్రమైన నొప్పిని భరిస్తుంది.ప్రేమలో మోసపోతే అదే స్థాయిలో బాధ ని అనుభవిస్తారు. ఆ మోసం చేసింది ఆడైనా, మగైనా సరే వారికి పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అయిపోతారు. ఇప్పటి జనరేషన్ ప్రేమని తేలిగ్గా తీసుకొని బ్రేకప్ చెప్పేస్తుంది. అయినా మనిషి పుట్టింది ప్రేమించడానికే కాదు, సాధించడానికి కూడా అంటూ ఇంద్రజ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
also read: స్పీడ్ పెంచిన చిరంజీవి.. సెకండ్ సాంగ్ లిరిక్స్ విని ఫీల్ అవ్వడం మానండి
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



