ప్రొడ్యూసర్ కి 11 కోట్లు వెనక్కి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్!
on Jun 4, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ హరిహరవీరమల్లు(Hari Hara veeramallu)ఈ నెల 12 న విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా మొదలైన విషయం తెలిసిందే. ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో భారీ ఎత్తున జరపడానికి ప్లాన్ చేసారు. దీంతో పవన్ స్పీచ్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. కానీ వీరమల్లు పన్నెండవ తారీకు నుంచి కూడా వాయిదా పడనుందనే వార్తలు సోషల్ మీడియా వేదికగా గత రెండు రోజుల నుంచి వినిపిస్తున్నాయి. వీరమల్లు ని నిర్మించిన ఏఏం రత్నం కి ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయని, అందుకే వీరమల్లు వాయిదా పడనుందని అంటున్నారు.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి వీరమల్లు కోసం తాను తీసుకున్న 11 కోట్ల రూపాయిల అడ్వాన్స్ ని ఏ ఎం రత్నం కి వెనక్కి ఇచ్చాడని, ఆ డబ్బుతో రిలీజ్ కి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోమని చెప్పినట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఇక వీరమల్లు లో నిధి అగర్వాల్, బాబీ డియోల్, జిష్ణు సేన్ గుప్తా, అనసూయ, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీత సారధ్యంలో క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
