హరి హర వీరమల్లు.. ఇది నిజంగా పవన్ కళ్యాణ్ సినిమానేనా..?
on May 31, 2025

తెలుగునాట తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు. చాలా రోజుల ముందు నుంచే.. ఆ హడావుడి కనిపిస్తూ ఉంటుంది. కానీ, 'హరి హర వీరమల్లు' విషయంలో ఆ హడావుడి కనిపించడంలేదు. సినిమా విడుదలకు ఇంకా పది రోజులే సమయముంది. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గ హైప్ మాత్రం కనిపించట్లేదు.
ఐదేళ్ల క్రితం క్రిష్ దర్శకత్వంలో 'వీరమల్లు' సినిమా ప్రారంభమైంది. కరోనా రావడం, పవన్ పాలిటిక్స్ తో బిజీ కావడం.. వంటి కారణాలతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాని పూర్తి చేసే బాధ్యతను మరో దర్శకుడు జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా.. ఎట్టకేలకు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ.. 'వీరమల్లు'పై పెద్దగా బజ్ లేదు. దానికి రకరకాల కారణాలున్నాయి.
సినిమా బాగా ఆలస్యమవ్వడం, దర్శకుడు మారడం వంటి కారణాలు 'వీరమల్లు'పై హైప్ తగ్గేలా చేశాయి. సాంగ్స్ చార్ట్ బస్టర్స్ కాలేదు. ప్రమోషన్స్ విషయంలో మూవీ టీం దూకుడుగా లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. దానికితోడు పవన్ ఫ్యాన్స్ 'వీరమల్లు' సినిమా కంటే కూడా.. ఆ తర్వాత రానున్న 'ఓజీ' కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఇలా పలు కారణాల వల్ల పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గ హైప్ వీరమల్లుకి రావట్లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ స్టార్డంని తక్కువంచనా వేయలేము. ఆఫ్ లైన్ లో కల్ట్ ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. సాంగ్స్, ప్రమోషన్స్, హైప్ వంటి లెక్కలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించగలరు. మరి 'హరి హర వీరమల్లు'తో పవన్ కళ్యాణ్ సైలెంట్ గా వచ్చి సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



