Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ
on Dec 23, 2025

మూవీ : డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్
నటీనటులు: మమ్ముట్టి, విజీ వెంకటేశ్, గోకుల్ సురేశ్, మీనాక్షి ఉన్నికృష్ణన్, సుస్మిత భట్ తదితరులు
సినిమాటోగ్రఫీ: విష్ణు దేవ్
సంగీతం: దుర్బుక శివ
ఎడిటింగ్: ఆంటోనీ
దర్శకత్వం: గౌతమ్ మీనన్
ఓటీటీ : జీ5
కథ:
సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు. పూజ చివరిసారిగా కార్తీక్ ని కలవడానికి వెళ్ళిందని తెలుసుకున్న డొమినిక్.. కార్తీక్ , పూజ ఇద్దరు కలుసుకున్న 'మునార్'కి విక్కీతో కలిసి వెళ్తాడు. కార్తీక్ రెండేళ్ల క్రితమే కనిపించకుండాపోయాడని అతని చెల్లెలు నందిత (సుస్మిత భట్) చెప్తుంది. అది తెలిసి డొమినిక్ డిస్సప్పాయింట్ అవుతాడు. మరి కార్తీక్ , పూజలని డొమినిక్ కనిపెట్టాడా లేదా అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటే మొదటగా ఓ డెడ్ బాడీ.. దాని గురించి వెతుకుతూ క్లూలు తెలుసుకుంటూ ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. కానీ ఈ సినిమాలో అలా ఏం జరుగదు. మొదటగా ఓ క్లూ.. అది ఎవరిది.. తనకి ఏం జరిగింది.. దానివల్ల ఎవరెవరు ఇబ్బందులు పడ్డారు.. అసలు ఈ డొమినికన్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు. ఇలా ప్రతీ ఒక్క సీన్ అండ్ టేకింగ్ డీటేయిలింగ్ ఆసక్తికరంగా ఉంటుంది.
మొదటగా చెప్పాలంటే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే.. ఒక్కో సీన్ ని దాటుకుంటూ.. ఒక్కో క్లూతో ముందుకు వెళ్తుంటే కథ పూర్తిగా ఎంగేజింగ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిపోతుంది. అసలు క్లైమాక్స్ లో ఉండే ట్విస్ట్ ని థ్రిల్లర్ సినిమాలు రెగ్యులర్ గా చూసేవాళ్ళు కూడా ఊహించరు. కార్తీక్ చెల్లెలు నందితగా సుస్మిత భట్ నటన నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ సినిమా మొత్తం వినపడే పేర్లు.. కార్తీక్, పూజ, నందిత, డొమినిక్.. వీరి చుట్టూనే కథ అల్లుకున్నాడు దర్శకుడు.
సినిమా ఆరంభంలో కాస్త స్లోగా సాగుతోందనే భావన కలుగుతుంది కానీ అది కేసులో డీటేయిలింగ్ కోసం అని సెకెంఢాఫ్ లో అర్థమవుతుంది. కార్తీక్ నదిలో పడిపోయాడని డొమినిక్ కి తెలిసినప్పుడు అతను నందిత గురించి ఎంక్వైరికి ఎందుకు వెళ్ళాడు అనే సస్పెన్స్ బాగుంది. అయితే అప్పటిదాకా సాదాసీదాగా కనపడే ఓ మనిషి వెనకాల ఓ బలమైన కథ దాగి ఉందని అది తెలుసుకుంటే ప్రమాదం అని అప్పటికి డొమినిక్ కి అర్థమవుతుంది. ఈ సినిమా ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉంటుంది. కానీ సెకెంఢాఫ్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ప్రతీ ఆడియన్ కి కట్టిపడేస్తుంది.
నటీనటుల పనితీరు:
డొమినిక్ గా మమ్ముట్టి యాక్టింగ్ బాగుంది. నందితగా సుస్మిత భట్ నటన సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పూజగా మీనాక్షి ఉన్నికృష్ణన్, విక్కీగా గోకుల్ సురేశ్ తమ పాత్రలకి న్యాయం చేశారు.
ఫైనల్ గా :
ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారికి ఈ సినిమా ఓ ఫీస్ట్.
రేటింగ్: 2.75 / 5
✍️. దాసరి మల్లేశ్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



