పంచతంత్రం.. ఐదుగురు స్టార్స్ తో డైరెక్టర్ మారుతి మల్టీస్టారర్!
on Jan 6, 2026

ఐదుగురు స్టార్స్ తో పంచతంత్రం
డైరెక్టర్ మారుతి డ్రీమ్ ప్రాజెక్ట్
రాజా సాబ్ తో కల నెరవేరుతుందా?
టాలీవుడ్ కి నాలుగు పిల్లర్లుగా సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలను పరిగణిస్తుంటారు. అలాగే కోలీవుడ్ పిల్లర్స్ లో ఒకరిగా కమల్ హాసన్ పేరు నిలిచిపోతుంది. అలాంటి ఈ ఐదుగురు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి కదా. అలాంటి ఓ అద్భుతాన్ని తెరపైకి తీసుకురావాలనే ఆలోచన దర్శకుడు మారుతికి వచ్చింది.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ది రాజా సాబ్'(The Raja Saab) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ హారర్ కామెడీ ఫిల్మ్.. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ మూవీతో మారుతి పాన్ ఇండియా డైరెక్టర్ లీగ్ లోకి వెళ్లడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. దీంతో ప్రభాస్ తర్వాత మారుతి వర్క్ చేయబోయే స్టార్ ఎవరనే ఆసక్తి నెలకొంది. అయితే మారుతి మాత్రం.. ఒక్కరు కాదు, ఒకేసారి ఐదుగురు స్టార్స్ తో వర్క్ చేయడానికి కూడా రెడీనే అంటున్నారు.
Also Read: వారెవా వారెవా.. లెనిన్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
'రాజా సాబ్' ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మారుతి రివీల్ చేశారు. "నాకు మల్టీస్టారర్ చేయాలని ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, కమల్ హాసన్.. ఈ ఐదుగురితో పంచతంత్రం చేయాలని ఉంది. రాసే అంత కెపాసిటీ ఉంది. దానికి తగ్గ కంటెంట్ కూడా ఉంది. ఆ సినిమాని ఎప్పటికీ నిలిచిపోయేలా చేయాలి." అని మారుతి చెప్పుకొచ్చారు.
మంచి స్క్రిప్ట్ కుదిరితే మల్టీస్టారర్ చేయడానికి రెడీ అని.. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ప్రకటించారు. అలాగే వెంకటేష్, నాగార్జున, కమల్ హాసన్ లు.. మల్టీస్టారర్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు. ఒకవేళ 'రాజా సాబ్' మంచి విజయం సాధించి, ఈ ఐదుగురు స్టార్స్ ని మెప్పించే కథ మారుతి చెప్పగలిగితే.. 'పంచతంత్రం' సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. మరి మారుతి కల నెరవేరుతుందో లేదో చూడాలి. నెరవేరితే మాత్రం.. మారుతికి మాత్రమే కాదు, మూవీ లవర్స్ అందరికీ బిగ్ ట్రీట్ అని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



