రామ్ చరణ్ ,శంకర్ ల ఉచ్చులో దిల్ రాజు
on Sep 30, 2023
మెగా పవర్ స్టార్ బిరుదు నుంచి గ్లోబల్ స్టార్ బిరుదుకి మారిన తర్వాత రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకోబోతున్న సినిమా గేమ్ చేంజర్. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం గర్వించదలిగే శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ పాటికే రిలీజ్ కావలసిన గేమ్ చేంజర్ సినిమా నుంచి లేటెస్టుగా వచ్చిన ఒక వార్త రామ్ చరణ్ ఫాన్స్ ని కలవరపెడుతుంది.
రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన డాగర నుంచి రామ్ చరణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి .ఎందుకంటే శంకర్ సినిమా అంటే నేడు నూటికి నూరుపాళ్లు పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ కిందకి వస్తుంది. అన్ని భాషల్లోనూ హీరో ల తో పాటు సమానమైన క్రేజ్ ఉన్న దర్శకుడు శంకర్. తన ప్రతి సినిమా కథ లోను సామజిక ప్రయోజనాన్ని చెప్పడం శంకర్ స్పెషాలిటీ. దీంతో చరణ్ అండ్ శంకర్ అభిమానులు గేమ్ చేంజర్ మూవీ మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు.పైగా ఈ మూవీకి దిల్ రాజు నిర్మాత కాబట్టి బొమ్మ పక్కా హిట్ అని ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు .కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ గురించి తాజా అప్ డేట్ ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.
దిల్ రాజు తన సినీ కెరియర్ లోనే సుమారు 300 కోట్ల బడ్జట్ తో అత్యంత భారీ వ్యయంతో గేమ్ చేంజర్ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఏ ముహూర్తాన మూవీ ప్రారంభం అయ్యిందో గాని అప్పటినుంచి షూటింగ్ కి ఏదో ఒక రూపాన ఆటంకం కలుగుతూనే ఉంది.సుమారు సంవత్సరంన్నర క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి తాజాగా రామ్ చరణ్ చిన్నపాటి గాయానికి గురవవటం వలన షూటింగ్ వాయిదా పడింది. అంతకు ముందు కూడా గాయాల కారణంగా వాయిదా పడింది. అలాగే ఇంకో పక్క శంకర్ కమలహాసన్ తో తెరకెక్కిస్తున్న ఇండియన్ -2 మూవీ ని కూడా తెరకెక్కిస్తున్నాడు.ఇలా శంకర్ ఏకకాలంలో గేమ్ చేంజర్,ఇండియన్ 2 సినిమాలని తెరకెక్కిస్తుండం వలన కూడా గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది.
ఇంక అసలు విషయానికి వస్తే.. దిల్ రాజు 300 కోట్ల భారీ బడ్జెక్టు తో గేమ్ చేంజర్ మూవీని నిర్మిస్తుండంతో షూటింగ్ లేట్ అయ్యే కొద్దీ అమౌంట్ కి ఇంట్రెస్ట్ లు పెరుగుతాయి.ఎందుకంటే దిల్ రాజే కాదు ఏ ప్రొడ్యూసర్ అయినా ఫైనాన్స్ కి తీసుకొచ్చిన డబ్బుతోనే సినిమా నిర్మిస్తాడు. తీసుకొచ్చిన అమౌంట్ కి నెల నెల ఇంట్రెస్ట్ లు కడతారు. ఇప్పుడు దిల్ రాజు కూడా గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి నెల నెల ఫైనాన్స్ కడుతున్నాడు. కాబట్టి సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరిగితే దిల్ రాజు కి ఇంట్రెస్ట్ భారం ఉండదని అంటున్నారు. పైగా దిల్ రాజు వడ్డీలు కట్టే విషయంలో చాలా టెన్షన్ గా ఉన్నాడని అంటున్నారు. ఇప్పుడు ఈ వార్త గురించి సోషల్ మీడియా లో విన్న రామ్ చరణ్ అభిమానులు దిల్ రాజుకి నష్టం కలగకుండా గేమ్ చేంజర్ మూవీ రెగ్యులర్ గా షూటింగ్ జరగాలని కోరుకుంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
