ENGLISH | TELUGU  

ధురంధర్ 2 టీజర్ హైలెట్స్ ఇవే.. ఆ గెటప్ గమనించారా 

on Feb 3, 2026

 


-ధురంధర్ 2 టీజర్ హంగామా
-ఈ సారి పాన్ ఇండియా భాషల్లో
-పార్ట్ 1 ని మించి హిట్ అవుతుందా!


ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2)టీజర్ మార్కెట్ లోకి వచ్చేసింది.. రావడమే కాదు పార్ట్ 1 ని మించి ఉండబోతోందనే హామీ ఇవ్వడంతో పాటు ఈ సారి హిట్ సౌండ్ స్వచ్ఛమైన పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుందని చెప్పేలా హిందీ తో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించి సదరు అన్ని భాషల్లోను టీజర్ అడుగుపెట్టింది. దీంతో మార్చి 19 న ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద కోలాహలం నెలకొని ఉండనుంది. అందుకు పార్ట్ 2  టీజర్ ఇస్తున్న భరోసా ఏంటో చూద్దాం.

 

పార్ట్ టీజర్ సుమారు 1 నిమిషం 19 సెకన్లు ఉంది. ఆ ఒక నిమిషం పంతొమ్మిది సెకన్స్ లోనే హంజా అలీ మజారి గా ఉన్న  జస్కి రాత్ సింగ్ పాకిస్థాన్ తీవ్రవాదులతో వాళ్ళ మనిషిగానే ఉంటు ఈ సారి తన పోరాటాన్ని విసృతం చేసినట్టుగా ఉంది. రెహ్మాన్ డెకాయిట్ ముఠాకి నాయకుడిగా ఉన్నట్టుగా కూడా యాక్షన్ సీన్స్ వచ్చాయి. సదరు యాక్షన్ సీన్స్ ఒళ్ళు గగుర్పాటుకి గురయ్యేలా ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది.  రెహ్మాన్ ని చంపే విషయంలో సాయం చేసిన సంజయ్ దత్ పోషించిన అస్సాం చౌదరి క్యారక్టర్ ని కూడా చూపించడంతో సదరు క్యారక్టర్ మధ్య  హంజా అలీ మజారి మధ్య బాండింగ్ ఎలా ఉండబోతుందో  క్యూరియాసిటీ కూడా ఏర్పడింది.

 

Also read:  ఎందుకు మార్చారో ఎవరు చెప్తారు.. టీజర్ రాగానే మీకే తెలుస్తుందిగా


ఇక టీజర్ చివరలో హంజా అలీ మజారి చెప్పిన 'ఇది కొత్త భారత దేశం. సరిహద్దులు ధాటి  చొచ్చుకు వచ్చి దెబ్బ కొట్టి తీరుతుందని చెప్పిన ఒక్క డైలాగ్ చాలు టోటల్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడానికి. ఇక మొదటి భాగం మొత్తం గుబురు గడ్డం తో కనపడిన హంజా అలీ మజారి  పార్ట్ 2 లో  క్లీన్ షేవ్ లో జీన్స్, టీ షర్ట్స్ ధరించి కనపడటం టీజర్ కే  హైలెట్. గన్ను మాత్రం వదల్లేదు.శశ్వత్ సచ్ దేవ్ ఇచ్చిన ఆ  నిమిషం 19 సెకన్లుకి ఇచ్చిన ఆర్ ఆర్ కే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మరి దర్శకుడు ఆదిత్య దర్(Aditya Dhar)సృజనాత్మకత సదర్ ఆర్ ఆర్ కి పార్ట్ 2 కి కూడా ఈ మేర న్యాయం చేసిందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.  

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.