ప్రాణం పోయినా పర్లేదు.. పొగరు వదలను
on May 10, 2024
ఇదే.. ఇదే.. తెలుగు ధనుష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటుంది ఇదే. రఘువరన్ బిటెక్ నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న రోజు కూడా ఇదే. తమ అభిమాన హీరో మూవీ తమిళంతో పాటు తెలుగులోను ఒకేసారి అప్ డేట్ ఉండాలని. ఒకేసారి అప్ డేట్ ఇవ్వడమే కాదు డబుల్ ఆనందాన్ని కూడా తెచ్చింది.
ధనుష్ నయా మూవీ రాయన్.అచ్చమైన తెలుగు భాషలో ఫుల్ మాస్ సాంగ్ రిలీజ్ అయ్యింది. తల వంచి ఎరగడే ,తల దించి నడవడే, తల పడితే వదలడే, తన పేరు విజయుడే ,ప్రాణం పోతున్నా వస్తున్నా, పొగరు వీడడు వీడే..దూరం జరగండి నిప్పై వచ్చాడు వీడే అనే లిరిక్ తో స్టార్ట్ అయ్యింది. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యంలో వచ్చిన పాటలోని ప్రతి లిరిక్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యడంతో పాటు రాయన్ లోని ధనుష్ క్యారక్టర్ రేంజ్ ని కూడా చెప్తుంది. ఇప్పుడు ఈ సాంగ్ తెలుగు ధనుష్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహాన్ని తెస్తుంది. రేపు థియేటర్స్ లో రచ్చ ఖాయం. హేమ చంద్ర, శరత్ సంతోష్ లు ఆలపించగా ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కంపోస్జ్ చెయ్యడం విశేషం. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీంతో మిగతా సాంగ్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు
ఇక రాయన్ లో ఎన్నో విశేష అంశాలు ఉన్నాయి. ధనుష్ నే రచన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన సోదరుడు ఎన్నో హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించిన సెల్వ రాఘవన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. దుష్ర విజయన్,అపర్ణ బాలమురళి,ఎస్ జె సూర్య, సందీప్ కిషన్, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. రజనీకాంత్ జైలర్ కి కూడా ఈయనే నిర్మాత. జూన్ 13 న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ అండ్ ఏషియన్ లు కలసి విడుదల చేస్తున్నాయి