డియర్ ఉమ మూవీ రివ్యూ
on Apr 19, 2025
సినిమాపేరు:డియర్ ఉమ
నటీనటులు:సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్, కమల్ కామరాజ్, ఆమని, అజయ్ ఘోష్, రాజీవ్ కనకాల, పృథ్వీ రాజ్ తదితరులు
సినిమాటోగ్రఫి:రాజ్ తోట
ఎడిటర్: సత్య గిడుతూరి
సంగీతం: రాధన్
బ్యానర్స్:
రచన-నిర్మాత: సమయ రెడ్డి
దర్శకత్వం :సాయి రాజేష్ మహాదేవ్
విడుదల తేదీ:18 -04 -2025
విభిన్న కథాంశంతో రూపుదిద్దుకున్న డియర్ ఉమ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం
కథ
మనిషి ప్రాణాలు నిలబట్టే డాక్టర్ అవ్వాలని ఉమ (సుమయ రెడ్డి) ఒక పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి 'ఆయుష్ మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అవుతుంది. మరోవైపు దేవ్ (పృథ్వీ అంబర్) రాక్ స్టార్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ఆ తర్వాత ప్రేమలో విఫలమవడంతో తాగుడుకు బానిసై తన లక్ష్యంపై ఫోకస్ చేయలేక పోతాడు. దాంతో దేవ్ చెడిపోతోన్నాడని ఆగ్రహం వ్యక్తి చేసి అతని తండ్రి ఇంట్లోంచి గెంటేస్తాడు. దేవ్‌కి ఓ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో గుండెకు గాయం అవుతుంది. ఉమ చదువుతున్న ఆయుష్ హాస్పిటల్లో దేవ్‌ని జాయిన్ చేస్తారు. ట్రైనీ డాక్టర్‌గా చేస్తుంటుంది ఉమ. అక్కడే దేవ్ అన్నయ్య సూర్య (కమల్ కామరాజ్) కూడా వర్క్ చేస్తుంటాడు. అయితే ఆ హాస్పిటల్ నుంచి దేవ్ డిశ్చార్జ్ అయిన తరువాత ఆర్ట్ గ్యాలరీలో పని చేస్తుంటాడు. ఆ టైంలోనే ఉమతో దేవ్‌కి పరిచయం ఏర్పడుతుంది. ఉమతో కొన్ని రోజుల ప్రయాణం తర్వాత దేవ్ ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. దేవ్ తెలుసుకున్న నిజం ఏంటి?. అసలు ఉమకి ఏమైంది?. ఉమ కోసం దేవ్ ఏం చేశాడు? అనేదే ఈ కథ.
ఎనాలసిస్, నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు
ఉమ పాత్రలో సుమయ రెడ్డి(Sumaya Reddy)చక్కగా నటించింది. నిర్మాతగా, రచయితగా, నటిగా తన వంతు న్యాయం చెయ్యడంతో పాటుగా అందరినీ కదిలించే, అవగాహన కల్పించే, మేల్కొపే కథను రాయడంలో సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. ఎమోషన్స్ పలికించడంలో, తెరపై అందంగా కనిపించడంలోను సుమయ రెడ్డి తన మార్క్ తో మెప్పించింది. హీరోగా పృథ్వీ అంబర్(Pruthvi ambar)యాక్షన్, ఎమోషన్స్ తో పాటు అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కమల్ కామరాజ్ యాక్టింగ్ బాగుండంతో పాటు అజయ్ ఘోష్ పాత్ర మెప్పిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు పర్వాలేదనిపిస్తాయి.
"డియర్ ఉమర్" సినిమా చూసిన తర్వాత వైద్య రంగంపై ఒక రకమైన ఆలోచన కలుగుతుంది. సినిమాలో చూపించిన అన్యాయాలు నిజంగా కలచివేసేలా ఉన్నాయి. దర్శకుడు సాయి రాజేష్(Sai Rajesh Mahadev)ఈ కథను చాలా బాగా తెరకెక్కించారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండటం మెచ్చుకోదగ్గ విషయం. రధన్ సంగీతం సినిమా యొక్క భావోద్వేగాలను మరింత పెంచింది. రాజ్ తోట కెమెరా పనితనం చాలా సహజంగా అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సీన్స్ షాక్‌కు గురిచేశాయి. క్లైమాక్స్‌లోని పాట సినిమా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. సినిమా చూసిన తర్వాత ఒక మంచి సందేశాన్ని అందుకున్నామనే భావన కలుగుతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
