దారుణమైన రీతిలో చిన్మయి మార్ఫింగ్ పిక్.. డబ్బులు తీసుకొని చేసింది వీళ్ళే
on Dec 11, 2025

చిన్మయి కి షాక్
దారుణంగా మార్ఫింగ్ పిక్
వాళ్ళు ఎవరో కూడా చెప్పిన చిన్మయి
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 'చిన్మయి'(Chinmayi)కి పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న పేరు ప్రఖ్యాతులు తెలిసిందే. ఆ రెండు విభాగాల్లో స్టార్ స్టేటస్ ని పొందటంతో పాటు ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించింది. అదే విధంగా ఇండస్ట్రీతో పాటు బయట మహిళలు ఎదుర్కుంటున్న ఎన్నో సమస్యలపై తన గళాన్ని, భావాన్ని చాలా బలంగా చాటుతుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆకతాయిలు చెప్పడానికి కూడా అసభ్యం కలిగించే రీతిలో చిన్మయి ఫోటోని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఉంచారు.
ఆ మార్ఫింగ్ ఫోటోని చిన్మయి 'ఎక్స్' వేదికగా షేర్ చేయడంతో పాటు ఆ విషయంపై తన స్పందన ని తెలియచేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. సదరు వీడియోలో ఆమె మాట్లాడుతు 'ఈ రోజు ఒక పేజీ నుండి మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని తీసుకొని పోలీసులకి ట్యాగ్ చేసాను. చట్టపరమైన చర్యలు జరుగుతాయా లేదా అనేది సమస్య కాదు. డబ్బు తీసుకుని గత ఎనిమిది, పది వారాల నుంచి మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఫోటోలని మార్ఫింగ్ చేస్తు చెప్పరాని బూతులు తిట్టే వ్యక్తుల నుండి అమ్మాయిలని, వారి కుటుంబాలని కాపాడటానికి నేను ఈ వీడియో చేశాను అని చిన్మయి వెల్లడి చేసింది. తన మార్ఫింగ్ ఫొటో షేర్ చేసిన అకౌంట్ తాలూకు స్క్రీన్ షాట్ ని కూడా ఆమె పోస్ట్ చెయ్యడం జరిగింది.
Also read: తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్ లో బాలయ్య తాండవం
ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆడవారి పట్ల ఆ విధంగా ప్రవర్థించే వాళ్ళని పోలీసులు పట్ట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రీసెంట్ గా రష్మిక టైటిల్ రోల్ లో తెరకెక్కిన గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



